Mobile Phone: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. త్వరలో పెరగనున్న మొబైల్ ధరలు.. ఎందుకంటే..!

|

Aug 23, 2022 | 4:02 PM

Mobile Phone: రాబోయే కాలంలో మీ మొబైల్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ విడిభాగాలకు సంబంధించి కస్టమ్..

Mobile Phone: వినియోగదారులకు మరో ఎదురుదెబ్బ.. త్వరలో పెరగనున్న మొబైల్ ధరలు.. ఎందుకంటే..!
Mobile Phone
Follow us on

Mobile Phone: రాబోయే కాలంలో మీ మొబైల్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ విడిభాగాలకు సంబంధించి కస్టమ్ డ్యూటీకి సంబంధించి సీబీఐసీ వివరణ ఇచ్చింది. స్పీకర్, సిమ్ ట్రే వంటి భాగాలతో వచ్చే మొబైల్ ఫోన్ డిస్‌ప్లే అసెంబ్లీ దిగుమతిపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ) 15 శాతం మాత్రమే వస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్‌ కస్టమ్స్ (CBIC) తెలిపింది. మొబైల్ డిస్‌ప్లే అసెంబ్లీ యూనిట్ దిగుమతిపై ప్రస్తుతం 10 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తున్నారు. కానీ అసెంబ్లీలో ఉపయోగించే వ్యక్తిగత పరికరాల దిగుమతిపై ఎటువంటి సుంకం లేదు. మొబైల్ ఫోన్ డిస్‌ప్లే యూనిట్ టచ్ ప్యానెల్ కవర్ గ్లాస్, LED బ్యాక్‌లైట్, FPC వంటి భాగాలను కలిగి ఉంటుంది. దీని వల్ల మొబైల్ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

డిస్ ప్లే అసెంబ్లీల దిగుమతిలో తప్పుడు సమాచారం ఇస్తున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయని సీబీఐసీ పేర్కొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీసీడీలో మార్పులు చేశామని.. ఈ చర్యతో డిస్‌ప్లేల దిగుమతి విషయంలో మొబైల్ ఫోన్ తయారీదారుల ముందున్న పరిస్థితి ఇప్పుడు తేలనుందని ఈవై ఇండియా ట్యాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. భారతీయ, విదేశీ పెట్టుబడిదారులందరికీ ఈ సర్క్యులర్ సానుకూల సందేశాన్ని పంపుతుందని మొబైల్ ఫోన్ ఇండస్ట్రీ బాడీ ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) తెలిపింది. ఈ సర్క్యులర్ పరిశ్రమకు పెద్ద ఉపశమనమని, అనవసర వివాదాలు సృష్టించబోమని సంగతన్ చైర్మన్ పంకజ్ మొహింద్రూ అన్నారు.

కస్టమ్ డ్యూటీ రేట్లు ఎలా ఉంటాయి..

ఇవి కూడా చదవండి

CBIC తన ప్రాంతీయ కార్యాలయాలకు పంపిన సర్క్యులర్‌లో, మొబైల్ ఫోన్ డిస్‌ప్లే యూనిట్‌ను మెటల్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన బ్యాక్ సపోర్ట్ ఫ్రేమ్‌తో మాత్రమే దిగుమతి చేసుకుంటే, దానిపై 10 శాతం పన్ను విధించబడుతుంది. అయితే, మెటల్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన బ్యాక్ సపోర్ట్ ఫ్రేమ్‌ను విడిగా దిగుమతి చేసుకుంటే, 15 శాతం చొప్పున కస్టమ్స్ సుంకం విధించబడుతుంది. 10 శాతం రాయితీ రేటుతో BCD ప్రయోజనం డిస్‌ప్లే అసెంబ్లీ, దానికి జోడించిన ఇతర పరికరాలకు అందుబాటులో ఉన్నాయని CBIC స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి