AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Gates: తనవద్ద క్రిప్టో కరెన్సీలు లేవన్న బిల్ గేట్స్.. కారణం అదేనంటున్న దిగ్గజ వ్యాపారవేత్త..

Bill Gates: ఈ రోజుల్లో చాలా మంది క్రిప్టో కరెన్సీల్లో ఇన్వస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత వీటిపై ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. ఈజీ మనీ కోసం చాలా మంది వీటిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

Bill Gates: తనవద్ద క్రిప్టో కరెన్సీలు లేవన్న బిల్ గేట్స్.. కారణం అదేనంటున్న దిగ్గజ వ్యాపారవేత్త..
Crypto
Ayyappa Mamidi
|

Updated on: May 20, 2022 | 7:28 PM

Share

Bill Gates: ఈ రోజుల్లో చాలా మంది క్రిప్టో కరెన్సీల్లో ఇన్వస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత వీటిపై ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. ఈజీ మనీ కోసం చాలా మంది వీటిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆదరణకు తగినట్లుగానే విమర్శలూ వీటిపై ఉన్నాయి. బిలియనీర్లు సైతం వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపటం లేదు. గతంలో బిట్ కాయిన్ గురించి ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అనాసక్తి కనబరిచిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు అమెరికన్ వ్యాపార దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం ఇదే తరహాలో స్పందించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ కార్యక్రమంలో ఒక యూజర్ క్రిప్టో కరెన్సీలపై అడిగిన ప్రశ్నకు గేట్స్ బదులిచ్చారు. తాను క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయలేదని.. అవి విలువ లేని పెట్టుబడులను ఆయన అన్నారు. ఇతర పెట్టుబడుల్లా క్రిప్టోలు ఉండవని.. ఎవరో నిర్ణయించిన రేటుకు కొనటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ప్రజలు దాన్ని చూస్తున్న తీరును తాను పరిగణలోకి తీసుకోనని అన్నారు. ఏదైనా కంపెనీ విలువ అది తయారు చేసే ఉత్పత్తులు, సేవలపై ఆదారపడి ఉంటుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.

గతంలో క్రిప్టోలపై స్పందిస్తూ.. ప్రపంచంలో ఉన్న మెుత్తం బిట్ కాయిన్లు ఇచ్చినా తాను వాటికి 25 డాలర్లకు కూడా కొనబోనని అన్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. దీనికి బదులుగా తాను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తానని అన్నారు. పెట్టుబడుల గురించి తెలిసిన చాలా మంది క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిజంగా ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే వాటిలో ఉండే రిస్క్ చాలా ఎక్కువ, అమాంతం పెట్టుబడి విలువ ఒక్కోసారి సున్నాకు చేరే ప్రమాదం కూడా ఉంటుందని వారికి తెలుసు. పైగా వీటిపై నియంత్రణ లేక పోవటం వల్ల అనేక మోసాలు కూడా జరుగుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి