Micromax: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కి విపరీతమైన తగ్గింపు.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..

|

Dec 17, 2021 | 11:55 AM

Micromax: భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన సరసమైన స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ IN 2bని విడుదల చేసింది. ఫోన్ HD + రిజల్యూషన్‌తో

Micromax: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కి విపరీతమైన తగ్గింపు.. ధర, ఫీచర్లు తెలుసుకోండి..
Micromax In 2b
Follow us on

Micromax: భారతదేశపు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన సరసమైన స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ IN 2bని విడుదల చేసింది. ఫోన్ HD + రిజల్యూషన్‌తో 6.52-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 6GB RAM ఎంపికతో వస్తుంది. దీంతో ఫోన్‌ పనితీరు మెరుగ్గా ఉంటుంది. హుడ్ కింద ఫోన్ Unisoc T610 ప్రాసెసర్‌ని ఉపయోగిస్తుంది. ప్రస్తుతానికి Flipkart బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా Micromax IN 2b 4GB RAM 64GB స్టోరేజ్, 6GB RAMతో 64GB స్టోరేజ్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

వీటి ధరలు వరుసగా రూ. 8,499, 9,499గా ఉన్నాయి. రెండు స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌ల అసలు ధర వరుసగా రూ.8,999, రూ.9,999. కస్టమర్లు రూ.500 తగ్గింపుఉ ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డిసెంబర్ 16 నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది. కస్టమర్‌లు ఈసారి తక్కువ ధరకే IN 2B కొనుగోలు చేసే అవకాశం ఉంది. మైక్రోమ్యాక్స్ IN 2B 6.52-అంగుళాల మినీ డ్రాప్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.

Micromax IN 2b నలుపు, నీలం, ఆకుపచ్చ రంగులలో వస్తుంది. IN 2b Mali G52 GPUతో ARM Cortex A75 ఆర్కిటెక్చర్ ఆధారిత ఆక్టా కోర్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది మీకు Android OS అనుభవాన్ని అందిస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్ 2B వెనుక ప్యానెల్‌లో రెండు లెన్స్‌లు, LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ‘ఇన్’ లోగోతో కూడిన కెమెరా మాడ్యూల్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కుడి అంచులో పవర్, వాల్యూమ్ రాకర్ కీలు ఉంటాయి. ఎడమ అంచులో SIM ట్రే ఉంటుంది. టైప్-C పోర్ట్, మైక్రోఫోన్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ దిగువ అంచున ఇచ్చారు. మైక్రోమ్యాక్స్ IN 2B ఒక దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది మన్నికైనదిగా చేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్ 5, FM రేడియో, USB-OTG ఉన్నాయి.

HDFC Life: రిటైర్మెంట్ ప్లాన్‌ని ప్రవేశపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.. పాలసీదారులకు అనేక ప్రయోజనాలు..

NBCC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మేనేజ్‌మెంట్ ట్రైనీతో సహా అనేక పోస్టులు ఖాళీ.. ఎలా అప్లై చేయాలంటే..?

డార్క్ చాక్లెట్‌ కాఫీ ఎప్పుడైనా తాగారా..! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి..