EV Cars: టాటా ఈవీ ఆధిపత్యానికి చెక్ పెట్టిన ఎంజీ ఈవీ.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు

ప్రపంచవ్యాప్తంగా ఈవీ మార్కెట్ రోజురోజుకూ పెరిగిపోతుంది. భారతదేశంలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో మెజారిటీ వాటాలను కలిగి ఉంది, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, కర్వ్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలతో అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో టాటా గుత్తాధిపత్యానికి ఇటీవల ఎంజీ మోటర్స్ చెక్ పెట్టింది.

EV Cars: టాటా ఈవీ ఆధిపత్యానికి చెక్ పెట్టిన ఎంజీ ఈవీ.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
Mg Ev Windsor

Updated on: Feb 15, 2025 | 4:32 PM

భారతదేశంలో టాటా ఈవీ కార్లు ఎంజీ ఈవీలతో గట్టి పోటీను ఎదుర్కొంటున్నాయి. అక్టోబర్ 2024 నుంచి జనవరి 2025 వరకు  ఎంజీ విండ్సర్ ఈవీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. టాటాకు సంబంధించిన అత్యధికంగా అమ్ముడైన ఈవీల్లో రెండు అయిన టాటా నెక్సాన్, పంచ్ ఈవీలను అధిగమించి ఎంజీ విండర్స్ అమ్మకాలు సాగాయని నిపుణులు చెబతున్నారు. సెప్టెంబర్ 2024లో లాంచ్ చేసిన విండ్సర్ ఈవీ టాటా మోటార్స్ ఆధిపత్యానికి చెక్ పెట్టిందని నిపుణులు వివరిస్తున్నారు. ఎంజీ ఎలక్ట్రిక్ ఎంపీవీ సెప్టెంబర్‌లో 502 యూనిట్లు, అక్టోబర్‌లో 3,116 యూనిట్లు, నవంబర్‌లో 3,144 యూనిట్లు, డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, జనవరి 2025లో 3,450 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఐదు నెలల్లో మొత్తం 13,997 యూనిట్లు అమ్ముడయ్యాయి. 

టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ వరుసగా 7,047 యూనిట్లు, 5,708 యూనిట్లను రిటైల్ చేశాయి. అయితే కర్వ్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ వంటి మోడళ్లు కూడా టాటా ఈవీ అమ్మకాలకు కొంత వాటాను అందిస్తున్నందున ఇప్పటికీ ఈవీ రంగంలో టాటా మెజారిటీ మార్కెట్ వాటాను 45 శాతం వద్ద కలిగి ఉంది. అయితే ఎంజీ 37 శాతానికి చేరుకున్నందున త్వరలో టాటా ఈవీను అధిగమిస్తుందని అంచనావ వేస్తుంది. విస్తృత శ్రేణి ఈవీలు మొత్తం అమ్మకాల్లో ఎంజీ మోటార్ కంటే టాటా మోటార్స్‌కు ఆధిక్యాన్ని ఇస్తాయని చెబుతున్నారు. జనవరి 2025లో టాటా మోటార్స్ 5,037 యూనిట్ల ఈవీలను విక్రయించగా, ఎంజీ మోటార్ ఇండియా 4,225 యూనిట్లను రిటైల్ చేసింది. టాటా కంటే కేవలం 812 యూనిట్లు వెనుకబడి ఉంది. 

ఎంజీ మోటార్ భారతదేశంలో ఈవీల కోసం బోల్డ్ ప్రణాళికలను కలిగి ఉంది. ఎంజీ కంపెనీ మొత్తం మూడు మోడళ్లు జేఎస్ ఈవీ, కామెట్ ఈవీ, విండర్స్ ఈవీలను భారతదేశంలో అమ్మకాలను చేస్తుంది. అయితే కొత్తగా ప్రారంభించిన విండ్సర్ ఈవీ అమ్మకాలు చాలా బాగా జరుగుతున్నాయి. బాస్ రెంట్ స్కీమ్, క్యాబిన్ సౌకర్యం, లక్షణాలు, అపరిమిత కిలోమీటర్లతో బ్యాటరీకి జీవితకాల వారెంటీ వంటి ఫీచర్లు కొనుగోలుదారులను అధికంగా ఆకట్టుకున్నాయి. ఎంజీ విండర్స్  38 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫీ‌పీ బ్యాటరీతో ఫ్రంట్ ఆక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఈ కారు ఇది 136 బీహెచ్‌పీ, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంజీ విండర్స్ కారును ఓ సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి