Maruti Suzuki Sales: కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సేల్స్ భారీ స్థాయిలో పడిపోయాయి. మే మాసానికి సంబంధించిన మారుతి సుజుకి కార్ల సేల్స్ డేటాను ఆ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఏప్రిల్ మాసంతో పోలిస్తే మే మాసంలో మారుతి సుజుకి కార్ల సేల్స్ ఏకంగా 71 శాతం తగ్గాయి. ఏప్రిల్ మాసంలో 1,59,691 యూనిట్లు విక్రయించగా…కొవిడ్ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో మే మాసంలో కేవలం 46,555 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. మే మాసంలో అమ్ముడుపోయిన కార్లలో దేశియ మార్కెట్లో అమ్ముడుపోయినవి కేవలం 33,771 యూనిట్లు మాత్రమే.
మెడికల్ అవసరాల కోసం ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు తరలించేందుకు మారుతి సుజుకి సంస్థ మే 1 నుంచి 16 వరకు దేశంలోని తమ ప్లాంట్స్‌లో కార్ల ఉత్పత్తిని ఆపేసింది. గత ఏడాది మే మాసంలోనూ లాక్‌డౌన్ అమలు చేయడంతో కార్ల ఉత్పత్తి, విక్రయాలు తగ్గాయి.
మిగిలిన ఆటోమొబైల్ సంస్థలు సైతం మే మాసంలో అతి తక్కువ సేల్స్‌ను నమోదుచేసుకోనున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు కొత్త కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపకపోవడం కార్ల సేల్స్ గణనీయంగా తగ్గటానికి కారణంగా తెలుస్తోంది. కోవిడ్ ఉధృతి తగ్గుముఖంపట్టి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే కార్ల విక్రయాలు పుంజుకునే అవకాశముందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
రుతుపవనాలెక్కడ? స్కైమేట్..వాతావరణ శాఖ రెండిటి లెక్కల్లో తేడాలెందుకు.. ఎవరి లెక్కలు కరెక్ట్?
Sputnik-V: హైదరాబాద్ చేరుకున్న 30 లక్షల స్పుత్నిక్-వి వ్యాక్సిన్ డోసులు..