Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు..

|

Mar 17, 2021 | 12:52 PM

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో దూసుకుపోయిన ...

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు..
Gold Price Today:
Follow us on

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలలో హెచ్చు తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో దూసుకుపోయిన పసడి ధరలు కొన్ని రోజుల నుంచి నేల చూపులు చూస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.44,840 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,270 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,110 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,010 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,840 ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,270 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,910 ఉంది. మైసూర్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,830 ఉంది.

కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్‌ దాటి పోగా, ప్రస్తుతం మాత్రం 43వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి.

Nokia: సంచలన నిర్ణయం తీసుకున్న నోకియా.. భారీగా ఉద్యోగులను తొలగించనున్న దిగ్గజ సంస్థ..

Car Loan: కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ.. ఎంత ఈఎమ్‌ఐ కట్టాలో తెలుసుకోండి..