Mapmyindia IPO: ఇన్వెస్టర్లపై కనక వర్షం కురిపించిన మ్యాప్ మై ఇండియా.. ఎంతకు లిస్టయిందో తెలుసా..

డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఈరోజు స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. 53 శాతం ప్రీమియంతో బీఎస్ఈలో రూ.1,581 వద్ద ఈ స్టాక్ లిస్టైంది.

Mapmyindia IPO: ఇన్వెస్టర్లపై కనక వర్షం కురిపించిన మ్యాప్ మై ఇండియా.. ఎంతకు లిస్టయిందో తెలుసా..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 21, 2021 | 4:45 PM

డిజిటల్ మ్యాపింగ్ కంపెనీ మ్యాప్ మై ఇండియా ఈరోజు స్టాక్ మార్కెట్‌లో లిస్టయింది. 53 శాతం ప్రీమియంతో బీఎస్ఈలో రూ.1,581 వద్ద ఈ స్టాక్ లిస్టైంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 51.5 శాతం ప్రీమియంతో రూ.1,565 వద్ద లిస్టైంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,033గా ఉంది. దీంతో మొదటి రోజే ఇన్వేస్టర్లపై కనక వర్షం కురిపించింది. బలమైన లిస్టింగ్ తర్వాత, షేరు గరిష్ఠంగా రూ.1,586.85కి చేరుకుంది. MapMyIndia మాతృ సంస్థ CE ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ యొక్క IPO డిసెంబర్ 9న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమై డిసెంబర్ 13న ముగిసింది.

ఈ కంపెనీలో ఇప్పటికే ఉన్న వాటాదారులు, ప్రమోటర్లకు 10,063,945 వరకు ఈక్విటీ షేర్లు ఉన్నాయి. OFSలో రష్మీ వర్మ ద్వారా 42.51 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, క్వాల్కమ్ ఆసియా పసిఫిక్ Pte Ltd ద్వారా 27.01 లక్షల వరకు ఈక్విటీ షేర్లు, జెన్రిన్ కంపెనీ లిమిటెడ్‎కు 13.7 లక్షల వరకు ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.312 కోట్లు సమీకరించింది.

మ్యాప్ మై ఇండియా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 59.43 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది అంతకు ముందు సంవత్సరంలో రూ. 23.19 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో ఆదాయం రూ.148.63 కోట్ల నుంచి రూ.152.46 కోట్లకు పెరిగింది.

Read Also. Year Ender 2021: ఈ ఏడాదిలో రూ.25 వేల లోపు విడుదలైన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..!

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..