iPhone 16: రూ.90 వేల ఐఫోన్‌ 16 కేవలం రూ.27 వేలకే కొనుగోలు.. ఎలా సాధ్యమైందో చెప్పిన కస్టమర్‌

|

Oct 08, 2024 | 10:58 AM

ఇటీవల టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారతదేశంలో iPhone 16 ధర ప్రస్తుతం రూ. 79,900 కాగా, iPhone 16 256 GB వేరియంట్ ధర రూ. 89,900 ఉంది. కాగా, ఈ మోడల్ ఐఫోన్ ను ఓ వ్యక్తి కేవలం రూ.27వేలకు కొనుగోలు చేశాడు. ఇటీవల ఒక వ్యక్తి ఇంటర్నెట్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు...

iPhone 16: రూ.90 వేల ఐఫోన్‌ 16 కేవలం రూ.27 వేలకే కొనుగోలు.. ఎలా సాధ్యమైందో చెప్పిన కస్టమర్‌
Iphone 16
Follow us on

ఇటీవల టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారతదేశంలో iPhone 16 ధర ప్రస్తుతం రూ. 79,900 కాగా, iPhone 16 256 GB వేరియంట్ ధర రూ. 89,900 ఉంది. కాగా, ఈ మోడల్ ఐఫోన్ ను ఓ వ్యక్తి కేవలం రూ.27వేలకు కొనుగోలు చేశాడు. ఇటీవల ఒక వ్యక్తి ఇంటర్నెట్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు. దీని తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఆ వ్యక్తి ఐఫోన్ 16ని చౌకగా ఎలా కొన్నాడో ఒక ట్రిక్ ద్వారా చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో ప్రజలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఫోన్‌ ఇంత తక్కువ ధరల్లో ఎలా వచ్చిందో సదరు కొనుగోలుదారుడు వివరించాడు.

క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 89 వేల విలువైన ఐఫోన్ 16 రూ.27 వేలకే కొన్నట్లు ఆ వ్యక్తి రెడ్డిట్‌లోని పోస్ట్‌లో చెప్పాడు. వ్యక్తి రివార్డ్ పాయింట్లను ఉపయోగించి ఈ ఫోన్‌ని కొనుగోలు చేసినట్లు చెప్పాడు. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు ప్రతి కొనుగోలుపై కొన్ని రివార్డ్ పాయింట్‌లను ఇస్తాయని, వాటిని ఉపయోగించి మీరు డిస్కౌంట్ కూపన్‌లలో లేదా నగదు రూపంలో కూడా రీడీమ్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. తాను కూడా అలానే చేసినట్లు చెప్పాడు. ఐఫోన్ 16 కొనుగోలు చేసేటప్పుడు వ్యక్తి 62 వేలకు పైగా రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించాడు. ఆ తర్వాత ఈ ఫోన్ ధర గణనీయంగా తగ్గింది.

క్రెడిట్ కార్డ్‌లపై రివార్డ్ పాయింట్‌లు అందుబాటులో..

ప్రతి చెల్లింపు కోసం చాలా క్రెడిట్ కార్డ్‌లు తమ వినియోగదారులకు కొన్ని రివార్డ్ పాయింట్‌లను ఇస్తాయి. ఈ పాయింట్లను పొదుపు కోసం డిస్కౌంట్లుగా ఉపయోగించవచ్చు. ఈ రివార్డు పాయింట్లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడంతో తక్కువ ధరకే వచ్చింది.

ఎంత మొత్తం ఖర్చు చేసినందుకు ఎన్ని రివార్డ్ పాయింట్లు వచ్చాయి?

62,930 రివార్డ్ పాయింట్లను సేకరించడానికి ఎంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చిందని మరో వినియోగదారు రెడ్డిట్ పోస్ట్‌లో రాశారు. దీనికి ప్రతిస్పందనగా, ఐఫోన్ 16 కొనుగోలు చేసిన వినియోగదారు, ’15 లక్షల రూపాయలు’ అని పేర్కొన్నాడు. ఆ వ్యక్తి హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 15 లక్షలు విలువైన కొనుగోళ్లు చేసినట్లు చెప్పాడు. అందుకే అన్ని రివార్డు పాయింట్లు వచ్చాయి. ఆ తర్వాత అతను డిస్కౌంట్‌తో ఐఫోన్ 16 కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే దీని కొందరు తమకు కూడా చాలా రివార్డ్‌ పాయింట్లు వచ్చాయని, అయినా వాటి ద్వారా ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకపోతున్నామని కామెంట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎవరికి వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి