
RBI New Rules: భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక నష్టాలను ముందే అంచనా వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆస్తి వర్గీకరణ, మొండి బాకీల (NPA) గుర్తింపు, ఆదాయ గుర్తింపునకు సంబంధించి కొత్త దిశానిర్దేశాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమలులోకి రానున్నాయి.
ఇప్పటివరకు బ్యాంకులు ఏదైనా రుణం మొండి బాకీగా మారిన తర్వాతే (నష్టం జరిగిన తర్వాత) దానికి సంబంధించిన నిధులను కేటాయించేవి. కానీ ఇకపై ‘ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్’ (ECL) విధానం అమల్లోకి వస్తుంది. అంటే ఒక రుణం భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉందని బ్యాంక్ భావిస్తే, ఆ నష్టం జరగకముందే దానికి సరిపడా నిధులను పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: రోజుకు రూ.33 చెల్లిస్తే చాలు.. ఇంటికి ఏసీ, టీవీ, ఫ్రిజ్.. శాంసంగ్ అదిరిపోయే ఆఫర్.. వివరాలివే!
కొత్త నిబంధనల ప్రకారం రుణ ఖాతాలను మూడు దశలుగా విభజిస్తారు:
ఈ కొత్త విధానాన్ని స్వీకరించడానికి బ్యాంకులు మరింత సమయం కోరినప్పటికీ, ఆర్‌బీఐ దానిని తిరస్కరించింది. బ్యాంకులు తమ అంతర్గత వ్యవస్థలను సిద్ధం చేసుకోవడానికి ఒక సంవత్సరం సమయం ఇస్తూ, వచ్చే ఏడాది (2027) నుండి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మార్పుల వల్ల బ్యాంకుల లాభాలపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AI AC: భారతదేశంలో ఏఐ టవర్ ఏసీ విడుదల.. 10 సెకన్లలో కూలింగ్.. ధర తెలిస్తే షాకవుతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి