ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా ఇటీవలే కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మోడల్ కారులో సరికొత్త ఇంటీరియర్ డిజైన్, మెరుగైన డైనమిక్స్, అదనపు ఫీచర్లు, అదనపు భద్రత, మరిన్ని అదనపు ఫీచర్లతో వస్తుంది. ఈ ఎస్‌యూవీ తొమ్మిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంఎక్స్1, ఎంఎక్స్2, ఎంఎక్స్2 ప్రో, ఎంఎక్స్3, ఎంఎక్స్ 3 ప్రో, ఏఎక్స్5, ఏఎక్స్5 ఎల్, ఏఎక్స్7, ఏఎక్స్7 ఎల్ వేరియంట్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు ధరల విషయానికి వస్తే రూ. 7.49 లక్షల నుంచి 15.49 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం బుకింగ్లు మే 15, 2024న ప్రారంభమవుతాయి. అలాగే డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ కార్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు కార్లతో సరికొత్త మహీంద్రా కారును పోల్చి చూద్దాం.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3 ఎక్స్ఓ మూడు ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. 117 హెచ్‌పీ, 300ఎన్ఎం, 1.5 లీటర్ టర్బో డీజిల్, 111 హెచ్‌పీ, 200 ఎన్ఎం, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 130 హెచ్‌పీ, 230 ఎన్ఎం 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లతో వస్తుంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ మాన్యువల్‌కు 20.6 కిలోమీటర్ల మైలేజ్, ఏటీకి 21.2 కిలో మీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కంపెనీ క్లెయిమ్ చేసింది. 111 హెచ్‌పీ, 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఎంపీకి 18.9 కేఎంపీఎల్, ATకి 17.9 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని క్లెయిమ్ చేసింది. అత్యంత శక్తివంతమైన, 130 హెచ్‌పీ, 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఎంటీకి 20.1 కేఎంపీఎల్, ఏటీకి 18.2 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది.
సోనెట్ 116 హెచ్‌పీ, 250 ఎన్ఎం, 1.5 లీటర్ టర్బో డీజిల్, 120 హెచ్‌పీ, 170 ఎన్ఎం, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 83 హెచ్‌పీ, 115 ఎన్ఎం, 1.2-లీటర్ ఎన్ఎం పెట్రోల్ వంటి ఇంజన్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఐఎంటీకి 22.3 కేఎంపీఎల్, ఏటీకి 18.5 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. 120 హెచ్‌పీ, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఐఎంటీకి 18.7 కేఎంపీఎల్, డీసీటీకు 19.2 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఎంటీ ట్రాన్స్మిషన్‌తో 18.8 కేఎంపీఎల్ క్లెయిమ్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. సోనెట్ హెచ్‌టీఈ, హెచ్‌టీఈ(ఓ), హెచ్‌టీకే, హెచ్‌టీకే(ఓ), హెచ్‌టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్, జీటీఎక్స్ ప్లస్, ఎక్స్ లైన్లలో అందిస్తుంది. ఈ కార్ల ధరలు రూ. 7.99 లక్షల నుంచి 15.7 లక్షల వరకు ఉంటాయి.
సోనెట్, హ్యూందాయ్ వెన్యూ రెండు ఎస్‌యూవీలు ఒకే ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడి ఉంటాయి. అలాగే ఒకే ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ ధ్రువీకరించిన ఇంధన సామర్థ్య గణాంకాలు భిన్నంగా ఉంటాయి. ఐఎంటీతో కూడిన 1.5-లీటర్ టర్బో డీజిల్ 23.7 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని క్లెయిమ్ చేసింది. ఎంటీ, ఏటీ ట్రాన్స్ మిషన్‌తో కూడిన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వరుసగా 18.7 కేఎంపీఎల్, 18.15 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని క్లెయిమ్ చేసింది. 1.2-లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఎటీ 17.5 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. వెన్యూ ఈ, ఎస్, ఎస్ ఆప్ట్, 5 ప్లస్, ఎస్ ఆప్ట్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ఆప్ట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ కార్ల ధర కూడా రూ. 7.94 లక్షల నుండి 13.48 లక్షల వరకు ఉంటుంది
టాటా నెక్సాన్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. 120 హెచ్‌పీ, 170 ఎన్ఎం, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 115హెచ్‌పీ, 260 ఎన్ఎం, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్స్ కొనుగోలు చేయవచ్చు. ట్రాన్స్ మిషన్‌తో కూడిన టర్బో పెట్రోల్ 17.4 కేఎంపీఎల్, ఏఎంటీకు 17.18 కేఎంపీఎల్, డీసీఏ కోసం 17 కేఎంపీఎల్ మైలేజ్ అందిస్తుంది. డీజిల్ ఎంటీ, ఏటీ వరుసగా 23.23 కేఎంపీఎల్, 24.08 కేఎంపీఎల్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. నెక్సాస్ స్మార్ట్, స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్లెస్, ఫియర్స్ ప్లస్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ కార్ల ధరలు రూ. 8.15 లక్షల నుంచి 15.8 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..