Mahindra cars: ఆ కార్లపై ఏకంగా రూ. 1.25లక్షల వరకూ తగ్గింపు.. త్వరపడండి.. కారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం..

మీరు కారు కొనాలనుకొంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ బ్రాండ్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన టాప్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 1.25 లక్షల వరకూ తగ్గింపును పలు మోడళ్లపై కంపెనీ అందిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300, మారజ్జో, బొలేరో, బొలేరో నియో వంటి కార్లపై ఈ సెప్టెంబర్ నెలలో ఈ భారీ అందుబాటులో ఉంటుంది.

Mahindra cars: ఆ కార్లపై ఏకంగా రూ. 1.25లక్షల వరకూ తగ్గింపు.. త్వరపడండి.. కారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం..
Mahindra And Mahindra
Follow us
Madhu

|

Updated on: Sep 17, 2023 | 4:16 PM

మీరు కారు కొనాలనుకొంటున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ దేశీయ బ్రాండ్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన టాప్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 1.25 లక్షల వరకూ తగ్గింపును పలు మోడళ్లపై కంపెనీ అందిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300, మారజ్జో, బొలేరో, బొలేరో నియో వంటి కార్లపై ఈ సెప్టెంబర్ నెలలో ఈ భారీ అందుబాటులో ఉంటుంది. ఇదే మోడళ్లపై గత నెలలో కూడా ఇదే తరహా ఆఫర్లను ఎం అండ్ ఎం అందించినట్లు ఆటో కార్ ఇండియా(ఏసీఐ) రిపోర్టు చేసింది. అయితే మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి టాప్ సెల్లింగ్ మోడళ్లపైన థార్, స్కార్పియో ఎన్, ఎక్స్ యూవీ 700 వంటి మోడళ్లపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ఇవ్వేలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్లు మీ ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుంటాయి. మీరు ఉండే సిటీని బట్టి కొత్త వ్యత్యాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా మోడళ్లపై ఎంత మేర తగ్గింపు లభిస్తోందో తెలుసుకుందాం రండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ 400.. మహీంద్రా కంపెనీ నుంచి ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారుపై ఏకంగా రూ. 1.25లక్షల ఫ్లాట్ డిస్కౌంట్ ను ఎమ్ అండ్ ఎమ్ అందిస్తోంది. అయితే ఎటువంటి యాక్సెసరీస్ ఉచితంగా ఇవ్వరు. అలాగే ఈ ఆఫర్ ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్(ఈఎస్సీ)లేని మోడళ్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌యూవీ 400 కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈసీ, ఈఎల్ పేరిట ఉన్న ఈ రెండు వేరియంట్లు రేంజ్ పరిశీలిస్తే 375 కిలోమీటర్లు, 456 కిలమీటర్లుగా కంపెనీ ప్రకటించింది. అయితే రెండింటిలోనూ ఒకేరకమైన పవర్ ట్రైన్స్ ఉంటాయి. 150హెచ్ పీ పవర్, 310ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే మోటార్లే వాటిలో ఉంటాయి.

మహీంద్రా మారజ్జో.. ఈకారుపై రూ. 73,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తగ్గింపు రూపేణా రూ. 58,000 ఉంటుంది. జెన్యూన్ యాక్సెసరీస్ పై రూ. 15,000 వరకూ తగ్గింపు ఉంటుంది. దీనిలో 1.5 లీటర్, ఫోర్ సిలెండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 123హెచ్ పీ పవర్, 300ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది మూడు వేరియంట్లు, రెండు సీటింగ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మహీంద్రా ఎక్స్‌యూవీ 300.. ఈ కారు పెట్రోల్ వేరియంట్ పై మీరు రూ. 45,000 నుంచి 71,000 వేల వరకూ డిస్కౌంట్ పొందుతారు. అదే డీజిల్ వేరియంట్ పై రూ. 46,000 నుంచి రూ. 71,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లు కూడా 1.2 లీటర్, 1.5 లీటర్ ఇంజిన్ లతో వస్తాయి. 110హెచ్ పీ, 131 హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి.

మహీంద్రా బొలేరో, బొలేరో నియో.. బొలేరో కారుపై రూ. 25,000 నుంచి రూ. 60,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లతో పాటు జెన్యూన్ మహీంద్రా యాక్సెసరీస్ పై కూడా తగ్గింపు లభిస్తుంది. అలాగే బొలేరో నియో మోడల్ కారుపై రూ. 7000 నుంచి రూ. 35,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగ రూ. 15,000 వరకూ యాక్సెసరీస్ పూ తగ్గింపు లభిస్తుంది.

ఈ రెండు కార్లలోనూ 1.5 లీటర్ త్రీ సిలెండర్ డీజిన్ ఇంజిన్స్ ఉంటాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అందుబాటులో ఉంటుంది. అయితే బొలేరో నియోలో 100హెచ్పీ, 260ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ సామర్థ్యం బొలేరోలో కాస్త తక్కువ ఉంటుంది. 76హెచ్పీ, 210ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..