సొంతకారు అనేది ప్రతి మధ్య తరగతి ప్రజల కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి పొదుపుతో పాటు కార్ల లోన్లపై సొంతకారను కొనుగోలు చేస్తూ ఉంటారు. తయారీదారులు సంవత్సరం చివరిలో అమ్ముడుపోని స్టాక్‌లను క్లియర్ చేయాలని చూస్తున్నందున కొత్త కార్ కొనుగోలుదారులు కార్లు, ఎస్‌యూవీలపై ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 300 శ్రేణితో పాటు ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400పై చాలా ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. రెండోది రూ. 4.2 లక్షల వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. మహీంద్రా కార్లపై అందించే ఆఫర్లను ఓ సారి చెక్ చేద్దాం.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400పై గత నెలలో రూ.3.5 లక్షల తగ్గింపును ప్రకటించింది. అయితే ఈ నెలలో ఈ కారు ఈఎల్‌వేరియంట్‌పై రూ. 4.2 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది . ఈఎస్‌సీ లేని మోడల్‌లపై ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అయితే స్టాక్‌ల లభ్యతకు లోబడి ఘెస్‌సీ ఉన్న మోడల్‌లు రూ. 3.2 లక్షల వరకు తగ్గింపును పొందుతాయి. అయతే తక్కువ స్పెక్ ఈసీ వేరియంట్ రూ. 1.7 లక్షల వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉంది.ఈ ఆఫర్లు ఎక్స్‌యూవీ 400 లైనప్‌ని టాటా నెక్సాన్ ఈవీ కంటే చాలా సరసమైనదిగా చేస్తుంది. ఎక్స్‌యూవీ ఎక్స్‌ఎల్ 39.4 కేడబ్ల్యహెచ్ బ్యాటరీ, 7.2 కేడబ్ల్యూ ఛార్జింగ్ సామర్ధ్యాన్ని పొందుతుంది, అయితే ఈసీ ట్రిమ్ 34.5కేడబ్ల్యూహెచ్, 3.2 కేడబ్ల్యూ ఛార్జర్‌తో వస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400కు సంబంధించిన రెండు వెర్షన్లు ముందు చక్రాలను నడిపే 150 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా ప్రొపెల్ చేస్తున్నారు. ఎక్స్‌యూవీ 400 ధరలు రూ. 15.99 లక్షల నుంచి 19.39 లక్షల వరకు ఉంటాయి, ఎక్స్-షోరూమ్.
ఈ కారు మొత్తం శ్రేణి ఈ నెలలో ఆకర్షణీయమైన తగ్గింపులతో జాబితా చేసింది. ఇందులో పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు ఉన్నాయి. గరిష్ట తగ్గింపులు టాప్-స్పెక్ డీజిల్ వేరియంట్‌లపై రూ. 1.72 లక్షల వరకు లభిస్తాయి. అయితే తక్కువ-స్పెక్ డబ్ల్యూ6, డబ్ల్యూ4 ట్రిమ్‌లు వరుసగా రూ. 1.4 లక్షలు, రూ. 59,000 ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. రూ.14.76 లక్షల ధరతో టాప్-స్పెక్ ఎక్స్‌యూవీ 300 డబ్ల్యూ 8 డీజిల్ వేరియంట్ అన్ని తగ్గింపులను వర్తింపజేసిన తర్వాత దాని డీజిల్ ప్రత్యర్థులైన నెక్సాన్ , వెన్యూ, సోనెట్ వంటి అన్ని టాప్-స్పెక్ వేరియంట్‌ల కంటే మరింత సరసమైనదిగా ఉంటుంది. ఇంతలో ఎక్స్‌యూవీ 300కు సంబంధించిన బేస్-స్పెక్, 110హెచ్‌పీ టర్బో-పెట్రోల్ వేరియంట్‌లు రూ. 45,000-1.63 లక్షల మధ్య ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి, టాప్-స్పెక్ డబ్ల్యూ8 ట్రిమ్‌లపై గరిష్ట ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్‌ల ధరలు రూ.7.99 లక్షల-13.46 లక్షల మధ్య ఉంటాయి. అలాగే అధిక-స్పెక్ 130 హెచ్‌పీ టర్బో-పెట్రోల్ వేరియంట్‌లు వరుసగా డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8 ట్రిమ్‌ల కోసం రూ. 57,000, రూ. 1 లక్ష, రూ. 1.50 లక్షల తగ్గింపులతో జాబితా చేశారు. అయితే ఈ ఇంజిన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ధరలు రూ.9.31 లక్షల నుంచి రూ.13.01 లక్షల మధ్య ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి