Mahindra: ఇదేం క్రేజ్‌ బ్రో.. కేవలం 135 సెకన్లలో 999 కార్లు సేల్‌.. 682కి.మీ రేంజ్.. అంత ప్రత్యేకత ఏంటి?

Mahindra: ఇటీవల నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలకు తెగ క్రేజ్‌ పెరిగిపోతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపాయి. దీంతో రకరకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మహీంద్రా నుంచి అద్భుతమైన కారు విడుదలైంది..

Mahindra: ఇదేం క్రేజ్‌ బ్రో.. కేవలం 135 సెకన్లలో 999 కార్లు సేల్‌.. 682కి.మీ రేంజ్.. అంత ప్రత్యేకత ఏంటి?

Updated on: Aug 30, 2025 | 6:04 PM

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ SUV ప్రత్యేక BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ చరిత్ర సృష్టించింది. మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ బ్యాట్‌మ్యాన్ థీమ్‌పై రూపొందించిన ప్రపంచంలోనే మొట్టమొదటి SUV. ఈ ప్రత్యేక ఎడిషన్ కోసం బుకింగ్ ఆగస్టు 23న ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైంది. కంపెనీ ప్రకారం, బుకింగ్ ప్రారంభమైన వెంటనే దాని 999 యూనిట్లన్నీ కేవలం 135 సెకన్లలో అమ్ముడయ్యాయి. కంపెనీ మొదట దీనిని 300 యూనిట్లకు పరిమిత ఎడిషన్‌గా విక్రయించాలని ప్లాన్ చేసిందని కంపెనీ తెలిపింది. కానీ దాని విపరీతమైన డిమాండ్ కారణంగా దీనిని 999 యూనిట్లకు పెంచారు.

ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు ఊహించని దెబ్బ.. రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం ధర!

మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ధర రూ. 27.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ మోడల్ మహీంద్రా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (WBDGCP) మధ్య మొదటి భాగస్వామ్యంలో తయారు చేయబడింది.

ఇవి కూడా చదవండి

కారు ప్రత్యేకత ఏమిటి?

మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కంపెనీ ఎలక్ట్రిక్ SUV ప్యాక్ 3 వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది 79 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ARAI సర్టిఫైడ్ రేంజ్‌ను సింగిల్ ఛార్జింగ్ పై 682 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఈ బ్యాటరీ వెనుక ఆక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఇది గరిష్టంగా 286 hp శక్తిని, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతర్జాతీయ బ్యాట్‌మ్యాన్ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 20 నుండి ఈ పరిమిత ఎడిషన్ డెలివరీని ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి మహీంద్రా దీనిని అభివృద్ధి చేసింది.

ఇది కూడా చదవండి: Success Story: కేవలం 50 వేలతో టీకొట్టును ప్రారంభించిన యువకుడు.. నేడు రూ.7 కోట్ల టర్నోవర్‌.. ఎలా?

కారు లుక్ ఎలా ఉంది?

మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్రత్యేకంగా క్రిస్టోఫర్ నోలన్ ది డార్క్ నైట్ ట్రైలజీ డిజైన్ నుండి ప్రేరణ పొందింది. ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ SUVలో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, 20-అంగుళాల వీల్స్ ఎంపిక ఉన్నాయి. దీని వీల్ హబ్ క్యాప్‌లో బ్యాట్‌మ్యాన్ లోగో ఉంది. బ్రేక్‌లు, స్ప్రింగ్‌లు ఆల్కెమీ గోల్డ్ రంగులో ఉంటుంది. ఇన్ఫినిటీ రూఫ్‌పై డార్క్ నైట్ ట్రైలజీ లోగో, కారు లోపల బ్యాట్‌మ్యాన్ ప్రొజెక్షన్‌తో నైట్ ట్రైల్ కార్పెట్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ఈ ఎడిషన్ బ్యాట్‌మ్యాన్, అతని డిజైన్‌ గొప్ప రూపాన్ని ఇస్తుంది.

కారు ఎంత?

రూ.27.79 లక్షల ధరకు లభించే మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కస్టమర్లకు ప్రత్యేకమైన సూపర్ హీరో-నేపథ్య ఎలక్ట్రిక్ SUVని సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీని డిజైన్‌లో శాటిన్ బ్లాక్ ఫినిషింగ్, ముందు తలుపులపై బ్యాట్‌మ్యాన్ డెకల్స్, టెయిల్‌గేట్‌పై డార్క్ నైట్ చిహ్నం అలాగే ఫెండర్‌లపై బ్యాట్‌మ్యాన్ లోగోలు, బంపర్లు, రివర్స్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ ఎడిషన్‌ను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. మహీంద్రా BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కారు కొనుగోలుదారులు 001 నుండి 999 వరకు ప్రత్యేకమైన బ్యాడ్జ్ నంబర్‌ను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది. 2026లో ఇలాంటి మరిన్ని పరిమిత ఎడిషన్ మోడళ్లను కూడా ప్రారంభించవచ్చని కంపెనీ సూచించింది.

September-2025: సెప్టెంబర్‌ 1 నుంచి మారనున్న బ్యాంకుల నియమాలు.. ఇక ఛార్జీల మోత!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి