
లగ్జరీ కార్లంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఒక వ్యక్తి దగ్గర లగ్జరీ కారు లేకపోయినా, ఖరీదైన కార్ల గురించి తెలుసుకోవడం అతనికి చాలా ఇష్టం. ఇప్పుడు అత్యంత ఖరీదైన కారును తయారు చేసే కంపెనీ రోల్స్ రాయిస్ తప్ప మరే కంపెనీ లేదు. ఆ కంపెనీ కార్లపై అందరి దృష్టి ఉంటుంది. అందుకంటే ఆ కార్ల ప్రత్యేకత, ధర అందరిని ఆకర్షిస్తుంది.
రోల్స్ రాయిస్ కారు కేవలం ముగ్గురు వ్యక్తుల వద్ద మాత్రమే ఉందని నివేదికలు చెబుతున్నాయి. దాని ధర రూ. 232 కోట్లు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ బోట్ టెయిల్. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ ధర 28 మిలియన్ USD డాలర్లు. ప్రత్యేకత ఏమిటంటే రోల్స్ రాయిస్ ఈ కారును కేవలం మూడు యూనిట్లను మాత్రమే తయారు చేసింది.
3 మోడళ్లు మాత్రమే తయారీ:
ఈ రోల్స్ రాయిస్ కారును పడవలా రూపొందించారు. ఈ కారు మూడు మోడళ్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా తయారు చేశారు. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ అనేది 4 సీట్ల కారు. ఈ కారులో రెండు రిఫ్రిజిరేటర్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి షాంపైన్ నిల్వ చేయడానికి రూపొందించింది. ఈ రోల్స్ రాయిస్ కారు సూపర్ స్టైలిష్ కారు. ఈ కారుతో కంపెనీ తన 1910 కారుకు కొత్త లుక్ ఇచ్చింది. ఈ కారు ప్రత్యేకమైన సముద్ర నీలం రంగు నుంచి క్లాసిక్ యాచ్ డిజైన్ నుండి ప్రేరణ పొందింది. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ అనేది నాలుగు సీట్ల కన్వర్టిబుల్ కారు. దీని వెనుక భాగంలో అదనపు సౌలభ్యం కోసం ముడుచుకునే టేబుల్, టెలిస్కోపిక్ గొడుగు ఉన్నాయి. అదనంగా కారులో రెండు రిఫ్రిజిరేటర్లు అమర్చబడి ఉన్నాయి.
ఈ మూడు యూనిట్ల యజమానులు ఎవరు?
ఇది కూడా చదవండి: Minimum Balance Rules: పండగ లాంటి వార్త.. ఈ బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఛార్జీలు రద్దు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి