ప్రముఖ ఈవీ తయారీదారు ఒమెగా సైకి మొబిలిటీ మార్కెట్లోకి లూస్ అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఓఎస్ఎం ఇప్పటికే మోపిడో, కార్గో సెగ్మెంట్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ వేరియంట్‌తో వ్యక్తిగత వినియోగదారుల విభాగంపై దృష్టి సారిస్తోంది. ఈ స్కూటర్ మార్కెట్‌లోకి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. రాబోయే మూడు-నాలుగు నెలల్లో ఈ వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ రెడీ అవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అధునాతన డిజైన్‌తో అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ ఈవీ స్కూటర్ మార్కెట్‌లో ఉన్నఇతర స్కూటర్లకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఈవీ స్కూటర్ ఒమేగా, జే సంగ్ టెక్ కో., లిమిటెడ్ (కొరియన్ కంపెనీ) జాయింట్ వెంచర్ ద్వారా ఉత్పత్తి చేశారు. అయితే ఈ స్కూటర్ అసెంబ్లింగ్ మొత్తం భారతదేశంలోనే జరుగుతుంది.
ఓఎస్ఎం లూస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 100-150 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే గంటకు 140 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు-ఆరు వేరియంట్లలో ఐదు నుంచి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. రాబోయే సంవత్సరంలో వాహనం ఓఎస్‌ఎం యొక్క 178 ప్లస్ డీలర్‌షిప్ స్టోర్స్ ద్వారా ఈ స్కూటర్‌ను భారత్‌లో లాంచ్ చేయనుంది ఈ కంపెనీ సుమారు ఏడు సంవత్సరాలుగా లూస్ ఆర్అండ్‌డీపై పని చేస్తుంది. ముఖ్యంగా గరిష్ట భద్రతతో ఈ స్కూటర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్కూటర్ ధర మాత్రం ఇంకా వెల్లడికాలేదు. అయితే మార్కెట్‌లో ఉన్న స్కూటర్లకు పోటినిచ్చేలా ధర ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఓఎస్ఎం వాహనం ధరలను గణనీయంగా తగ్గించే స్కేలబిలిటీపై పని చేస్తుందని, తద్వారా ఈ వాహనాలను ఫ్రంట్‌లైన్ కార్మికులుగా పని చేసే ఈజీ అమర్చేలా ఉంటుంది. అందువల్ల స్కూటర్ ధరలు తక్కువగా ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..