New Rules From December 1: వినియోగదారులకు అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు

నవంబర్‌ నెల ముగిసి డిసెంబర్‌ నెల రాబోతోంది. డిసెంబర్‌ 1 నుంచి కొన్ని కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి..

New Rules From December 1: వినియోగదారులకు అలర్ట్‌.. డిసెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు
New Rules From December 1

Updated on: Nov 30, 2022 | 4:04 PM

నవంబర్‌ నెల ముగిసి డిసెంబర్‌ నెల రాబోతోంది. డిసెంబర్‌ 1 నుంచి కొన్ని కీలక అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి, ఇతర ఆర్థికపరమైన అంశాల గురించి ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులు ముందస్తుగా అప్రమత్తమైతే ఇబ్బందులు ఉండవు. మరి డిసెంబర్‌ 1 నుంచి ఎలాంటి మార్పులు ఉండనున్నాయో తెలుసుకోండి.

  1. పెన్షనర్ల లైఫ్‌సర్టిఫికేట్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్‌ పొందుతున్న వ్యక్తులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. పెన్షనర్లు ఈ సర్టిఫికేట్‌ను 30 నవంబర్ 2022లోపు సమర్పించాలి. దీని కోసం పెన్షనర్లు బ్యాంకు శాఖకు లేదా ఆన్‌లైన్‌లో వెళ్లి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. ఇప్పటి వరకు పొందుతోన్న పెన్షన్‌ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలంటే నవంబర్‌ 30లోపు లైఫ్‌ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది.
  2. గ్యాస్‌ ధరలు: ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్‌ ధరల్లో మార్పులు ఉంటాయి. గ్యాస్‌ ధరల్లో తగ్గవచ్చు.. లేదా పెరగవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి రోజు లేదా మొదటి వారంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను సవరిస్తుంటాయి ఆయిల్‌ కంపెనీలు. అయితే పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నెలఖారులోపు కొనుగోలు చేసే ఆలోచన ఉంటే చేసుకోండి. దీని వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే గత నెలలో వాణిజ్య సిలిండర్‌పై కేంద్రం ధరల తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నెలలో కూడా ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  3. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏటీఎం: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) ఏటీఎం నుంచి డబ్బులు ఉపసంహరణ నిబంధనలను మార్చింది. కస్టమర్లు మోసాల నుంచి రక్షించుకునేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెషీన్‌లో ఏటీఎం కార్డును పెట్టిన తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం పిన్‌ ఎంటర్‌ చేసిన తర్వాతే మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.
  4. రైలు టైమ్‌టేబుల్‌లో మార్పు: రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో మార్పులు చేస్తుంటుంది. రైల్వే శాఖ సాధారణంగా శీతాకాలంలో రైళ్ల షెడ్యూల్‌ను మారుస్తుంది. సవరించిన రైలు షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి