న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలు సామాన్యుడికి షాకిచ్చాయి. కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్సిలిండర్ల ధరలను అదనంగా రూ.7 వరకు పెంచుతూ మంగళవారం (జులై 4) నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. ఐతే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఆయిల్ కంపెనీలు గ్యాస్సిలిండర్ల రేట్లలో మార్పు చేస్తుంటాయి. జులై నెల ప్రారంభమైన మూడు రోజుల తర్వాత గ్యాస్ రేట్లు పెంచి అందరికీ షాకిచ్చాయి. పెరిగిన ధరలు జులై 1 నుంచే అమలు చేస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. కమర్షియల్గ్యాస్ధరలు పెరగడంతో దుకాణదారులు, హోటల్ యజమానులపై భారం పడనుంది. ఫలితంగా మార్కెట్‌లో ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ఇళ్లలో వినియోగించే గృహ వినియోగ గ్యాస్సిలిండర్ల ధరల విషయానికొస్తే హైదరాబాద్లో రూ.1155, ఢిల్లీలో రూ.1103, ముంబైలో రూ.1102.50, చెన్నైలో రూ.1118.50, బెంగళూరులో రూ.1105, శ్రీనగర్‌లో రూ.1219లుగా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.