
గత కొన్నాళ్లుగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలతో సామాన్యులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ ధరలను కొంత తగ్గించినప్పటికీ.. గృహ వినియోగ గ్యాస్ ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇదిలా ఉంటే.. ఒకవేళ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ చోరీ అయినా.. లేదా పోగొట్టుకున్నా ఏం చేయాలి? గ్యాస్ కనెక్షన్ రద్దవుతుందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అయితే గ్యాస్ సిలిండర్ పోయినంత మాత్రాన మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కాదు. సరఫరా కూడా నిలిపివేయడం జరగదు. అయితే దీనికి సంబంధించి వినియోగదారులు కొన్ని చట్టపరమైన ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ సిలిండర్ చోరీ అయితే వెంటనే ఇవి ఫాలో అవ్వాలి..
పోలీస్ కంప్లైంట్: సిలిండర్ మిస్ అయిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వాలి. ఫిర్యాదు చేసేటప్పుడు సిలిండర్ ప్రత్యేక సంఖ్యను ఖచ్చితంగా తెలపాలి. దీనివల్ల ఒకవేళ దొంగిలించిన సిలిండర్‌ను ఎక్కడైనా విక్రయిస్తుంటే పట్టుకోవడం సులభం అవుతుంది. చోరీకి సంబంధించిన వివరాలను, ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మీ గ్యాస్ ఏజెన్సీకి వాతపూర్వకంగా తెలియజేయాలి.
సిలిండర్ అనేది ప్రభుత్వ ఆస్తి. కాబట్టి వినియోగదారుడి నిర్లక్ష్యం వల్ల అది పోతే గ్యాస్ కంపెనీలు జరిమానా విధిస్తాయి. నిబంధనల ప్రకారం వినియోగదారుడు రూ.1,000 నుండి రూ.3,000 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ కూడా పోగొట్టుకుంటే.. ఈ ఫైన్ అమౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఏజెన్సీని బట్టి ఈ మొత్తంలో స్వల్ప మార్పులు ఉంటాయి.
మీరు ఈ పత్రాలన్నింటినీ సమర్పించిన తర్వాత గ్యాస్ ఏజెన్సీ అధికారులు వాటిని వెరిఫై చేస్తారు. అంతా సవ్యంగా ఉండి, మీరు నిర్దేశిత జరిమానా లేదా డిపాజిట్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత ఏజెన్సీ మీకు కొత్త సిలిండర్‌ను ఇస్తుంది. అయితే ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది.