Gas Cylinder Prices: ప్రతినెల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏంటి ప్రతి నెల 1వ తేదీన ధరల్లో మార్పులు ఉంటాయి.. ఇప్పుడేంటి అనుకుంటున్నారా..? అయితే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) ధర పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. సోమవారంతో దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగవచ్చు. 14 ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 130 డాలర్లకుపైగా చేరింది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియనుండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
అందుకే మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయినట్లయితే ఈరోజే బుక్ చేసుకోవడం బెటర్. ఒకవేళ ధర పెరిగినట్లయితే ఎక్కువ ధరతో బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎల్‌ఫీజీ గ్యాస్ సిలిండర్ ధఱలను అమెరికా డాలర్‌తో ఇండియన్ రూపాయి మారక వలువ కూడా ప్రభావితం చేస్తుంది. రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. రూపాయి పడిపోవడం కారణంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మార్చి 8 నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు పెరిగే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్‌ధరలు కూడా రూ.12లకుపైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 1న గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన విషయం తెలసిఇందే. కమర్షియల్ గ్యాస్ సిలండర్ ధర రూ.105 వరకు పెరిగింది. అలాగే 5 కిలోల గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.27 వరకు పెరిగింది.
ఇవి కూడా చదవండి: