AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై ఇవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఇంట్రెస్టింగ్‌ స్టోరీ!

LPG Gas Cylinder: ప్రతి రోజూ ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్‌ను కూడా తనిఖీ చేయాలి..

LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌పై ఇవి ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఇంట్రెస్టింగ్‌ స్టోరీ!
Subhash Goud
|

Updated on: Dec 09, 2025 | 10:51 AM

Share

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌కు రకరకాల కోడ్ఉంటయి. వాటిని మీరెప్పుడైనా గమనించారా? ముఖ్యంగా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా అనే అనుమానం రావచ్చు. ఇంట్లో వంట కోసం ప్రతి రోజూ ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్ గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్‌ను కూడా తనిఖీ చేయాలి. ఎల్‌పీజీ గ్యాస్‌ ప్రతి ఇంటికి అవసరమైనదిగా మారింది. ఎల్‌పీజీ సిలిండర్లను చాలా ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగిస్తారు. సిలిండర్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఎల్‌పీజీ సిలిండర్ బరువు, లీకేజీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే తీసుకుంటారు. అయితే ప్రత్యేక రకం కోడ్‌ను కూడా తనిఖీ చేయాలి.

ఇవి కూడా చదవండి

ఈ కోడ్ అర్థం ఏమిటి?

గ్యాస్ సిలిండర్ పైభాగంలో ప్రత్యేక కోడ్ రాసి ఉంటుంది. ఈ కోడ్ అక్షరాలు, సంఖ్యల రూపంలో నమోదు చేయబడుతుంది. ఈ కోడ్ సిలిండర్ గడువు తేదీ గురించి చెబుతుంది. సిలిండర్‌పై రాసిన A,B,C,D అంటే సంవత్సరంలో 12 నెలలు. అయితే ఈ సిలిండర్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుందో సంఖ్య చెబుతుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఈ సిలిండర్లను పంపిణీ చేస్తారు. సంవత్సరంలో 12 నెలలు నాలుగు భాగాలుగా విభజించి ఉంటాయి.

ఇది కూడా చదవండి: Tata Nexon: కేవలం రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?

Lpg Gas1

  • A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి.
  • B అంటే ఏప్రిల్, మే, జూన్.
  • C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్.
  • D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సిలిండర్‌పై ఉండే ఏబీసీడీల అర్థం. ఇవి నెలలను సూచిస్తుంది.

ఉదాహరణకు.. ఒక సిలిండర్‌లో A 26 అని రాసి ఉన్నట్లయితే ఈ సిలిండర్ గడువు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ముగుస్తుంది అని అర్థం. అలాగే 26 అంటే 2026 సంవత్సరంలో గడువు ముగుస్తుంది అని అర్థం. మరోవైపు, B 26 అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు ఏప్రిల్, మే, జూన్‌లలో ముగుస్తుందని, 26 అంటే 2026లో గడువు ముగుస్తుందని అర్థం.

గడువు ముగిసిన సిలిండర్‌ వాడితే ప్రమాదమే..

మీరు గడువు తేదీ తర్వాత కూడా సిలిండర్‌ని ఉపయోగిస్తుంటే అది మీకు ప్రమాదకరం. సిలిండర్‌ పేలి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. మీరు సిలిండర్‌ పొందిన సమయంలో ఈ కోడ్‌లను తప్పకుండా తనిఖీ చేయాలి. అందుకే గ్యాస్ కంపెనీలు సిలిండర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాయి.

ఇది కూడా చదవండి: Home Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం.. 70 శాతం వరకు లాభం..!

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే కోచ్‌లపై పసుపు, నీలం, తెల్లటి గీతలు ఎందుకు ఉంటాయి? ఇంట్రెస్టింగ్‌ స్టోరీ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి