LPG Gas Cylinder Benefits: మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా…?అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకొని ఉండాలి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రమాద బీమా కవరేజ్ అందిస్తున్నాయి. ఏకంగా రూ.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ పేలుడు సంభవించిన సమయంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ బీమా ప్రయోజనం అందుబాటులో ఉన్న దీని గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు. ఈ బీమా కవరేజ్ గురించి గ్యాస్ కంపెనీలు గానీ, ప్రభుత్వాలు గానీ ఎవ్వరు కూడా ప్రచారం చేయరు. అందుకే జనాలకు పెద్దగా తెలిసి ఉండదు. ఇలాంటి బీమా సౌకర్యం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు.
పెట్రోలియం కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. హిందుస్తాన్ పెట్రోలియం, ఇండేన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు ఐసీఐసీఐ లంబార్డ్ ద్వారా ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి.
మైఎల్‌పీజీ.ఇన్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకున్న వారు గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదానికి గురైతే రూ.50 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఒక్కొక్కరిరికి రూ.10 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలి.
అలాగే ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. గ్యాస్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఈ పాలసీ ఒక్కొక్కరి పేరుపై ఉండదు. కానీ అందరికీ వర్తిస్తుంది. దీని కోసం గ్యాస్ కస్టమర్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రమాదం జరిగి ప్రాణాపాయం సంభవించినట్లయితే ఎఫ్ఐఆర్, మెడికల్ ట్రీట్‌మెంట్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ బిల్స్, పోస్ట్‌మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ వంటివి అందించాల్సి ఉంటుంది.
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఇన్సూరెన్స్ కోసం అవే క్లెయిమ్ చేస్తాయి. గ్యాస్ సిలిండర్ వినియోగదారులు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ డబ్బులు డిస్ట్రిబ్యూటర్‌కు చేరుతాయి. తర్వాత వినియోగదారులకు లభిస్తాయి. ఇకపోతే ప్రస్తుతం ఎల్‌పీజీ సిలిండర్ కొనుగోలు చేయాలంటే రూ.900 చెల్లించాలి. ఇలా గ్యాస్ సిలిండర్‌పై కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియలంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ లేదా గ్యాస్ కంపెనీ వాళ్లను సంప్రదిస్తే చెబుతారు.