Bank Loan: ఒకప్పుడు కార్లపై రుణాలు తీసుకోవాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కేవలం మొబైల్ ద్వారానే రుణానికి సంబంధించిన ప్రాసెస్ చకచక జరిగిపోతుంటుంది. ఇక కొత్త కారు (Car) కొనుగోలు, పాతకారు అమ్మకాలు కూడా చాలా పెరిగిపోయాయి. దీంతో సెకండ్ హ్యాండ్ కార్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అర్హత ఉన్నవారు, నెలవారీ వేతనం పొందేవారు, స్వయం ఉపాధి పొందేవారు ఈ ప్రీ-ఓన్డ్ కారు రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని బ్యాంకులు కూడా సెకండ్ హ్యాండ్ కారు (Second Hand Cars)ను కొనుగోలు చేయడానికి రుణాలను అందిస్తున్నాయి. రుణం పొందాలంటే మీ ఆదాయంతో పాటు కారు విలువ, క్రెడిట్ స్కోర్‌ను పరిగణలోకి తీసుకుని రుణాలు మంజూరు చేస్తుంటాయి బ్యాంకులు.
కారు విలువలో సుమారు 70 శాతం వరకు రుణం ఇస్తాయి బ్యాంకులు. అలాగే కారు రుణాలపై మూడేళ్ల వరకు ఈఎంఐ సదుపాయం ఉంటుంది. కారు రుణం కోసం ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 అంతకన్నా ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కాలానికి రూ.3.50 లక్షల కారు రుణానికి నెలకు రూ.10వేల నుంచి రూ.11 వేల వరకు ఈఎంఐ రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏయే బ్యాంకులో ఎంత వడ్డీ వర్తిస్తుందో చూద్దాం.
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.85 శాతం, కెనరా బ్యాంకు 7.30 శాతం, పంజాబ్ నషనల్ బ్యాంకు 7.75 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 8.55 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.60 శాతం, ఎస్‌బీఐ 8.70 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 9.85 శాతం, కర్ణాటక బ్యాంకు 10.10 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 12 శాతం, కరూర్ వైశ్య బ్యాంకు 12 శాతం, యాక్సిస్ బ్యాంకు 13.25 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 13.75 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: