AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Renovation Loans: ఇంటి రీమోడలింగ్‌కు బ్యాంకు రుణం.. గమనించాల్సిన అంశాలు ఇవే..!

ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఎంతో కష్టబడి, ప్రతి రూపాయికి కూడబెట్టి దాన్ని నిర్మించుకుని ఉంటారు. ఆ ఇంటిలో మీకు ఎన్నో తీపి గుర్తులు ఉంటాయి. పిల్లలు పుట్టడం, పెరగడం, వారి వివాహాలు.. ఇలా అనేక సందర్భాలకు ఇల్లు ప్రత్యక్ష సాక్షి అని చెప్పవచ్చు. అయితే మీరు కట్టుకున్న ఇల్లు కొంత కాలానికి పాతబడిపోతుంది. చుట్టు పక్కల మరిన్ని అందమైన భవనాలు వస్తాయి. దీంతో మీ ఇంటిని పునరుద్ధరించాల్సిన (రీ మోడలింగ్) చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని కోసం పెట్టుబడిని సమకూర్చుకోవడానికి మీకు ఈ కింద తెలిపిన ఆర్థిక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Home Renovation Loans: ఇంటి రీమోడలింగ్‌కు బ్యాంకు రుణం.. గమనించాల్సిన అంశాలు ఇవే..!
Home Loan
Nikhil
|

Updated on: Apr 22, 2025 | 4:30 PM

Share

ఇంటిని పునరుద్దరించడం అంటే కేవలం అందాన్ని తీసుకురావడమే కాదు. దాన్ని విలువను మరింత పెంచడం అని చెప్పవచ్చు. ఇంటికి మరమ్మతులు చేయడం, కొత్త ఫ్లోరింగ్ వేయడం, మరుగుదొడ్లు పెంచడం, పైన అంతస్తు వేయడం, కుటుంబ సభ్యుల అవసరాలకు అనుగుణంగా గదులను విస్తరించడం.. ఇలా అనేక పనులు చేయవచ్చు. కొత్త ఇంటిని నిర్మించుకున్నప్పుడు ఇచ్చే రుణాల మాదిరిగానే, ఇంటి పునరుద్దరణకు కూడా బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. వాటిని ఈ కింద తెలిపిన విధానాల్లో పొందవచ్చు.

బ్యాంకు రుణాలు

ఇంటి మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక రుణాలను అందజేస్తాయి. సాధారణ వడ్డీ రేట్లు, నెలవారీ వాయిదా పద్ధతుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తీసుకుని ఇంటిని బాగుచేయించుకోవచ్చు.

వ్యక్తిగత రుణాలు

కొందరు వ్యక్తిగత రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. వాటితో ఇంటికి మరమ్మతులు చేయించుకుంటారు. వీటిని ఎలాంటి పూచీకత్తు లేకుండా చాలా సులభంగా పొందవచ్చు. అయితే ఇంటి మరమ్మతు రుణాలతో పోల్చితే వీటికి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఆస్తిపై రుణం (ఎల్ఏపీ)

ఆస్తిపై రుణం తీసుకుని, ఆ సొమ్ములను మరమ్మతుల కోసం వినియోగించవచ్చు. వీటిని ఎల్ఏపీ రుణాలు అంటారు. వ్యక్తిగత రుణాలలో పోల్చితే వీటికి తక్కువ వడ్డీపై పెద్ద మొత్తంలో రుణాలను అందజేస్తారు. ఇప్పటికే హౌసింగ్ రుణం ఉంటే, మీరు టాప్ అప్ రుణం పొందవచ్చు. దీన్ని మీ ఇంటి పునరుద్దరణతో సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.

పరిశీలించాల్సిన అంశాలు

  • రుణం తీసుకునే ముందు రుణ గ్రహీతలు కొన్ని అంశాలను పరిశీలించాలి. వాటిని గమనించి రుణం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
  • ముందుగా ఇంటి పునరుద్దరణ ప్రాజెక్టు ఖర్చును అంచనా వేయాలి. ఏఏ ప్రాంతాలను మార్పు చేయాలో గమనించి, బడ్జెట్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వాస్తవంగా ఆ మార్పులకు ఎంత ఖర్చువుతుందో కచ్చితంగా అంచనా వేయాలి. అవసరమైతే అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
  • రుణదాతలు అందించే రుణాలకు సంబంధించిన వడ్డీరేట్లను తెలుసుకోవాలి. రుణ నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు, కస్టమర్ సేవ తదితర అంశాలను పరిగణించండి. మీకు అనుకూలంగా ఉండే రుణదాతను ఎంపిక చేసుకోండి.
  • రుణదాత నిర్దేశించిన అర్హతా ప్రమాణాలను తెలుసుకోండి. వాటిలో మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగ స్థితి, ఆస్తి తదితర అంశాలు ఉండవచ్చు.
  • రుణ ఒప్పందం, నిబంధనలు, షరతులను పూర్తిగా తెలుసుకోవాలి. వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే షెడ్యూల్, ముందస్తు చెల్లింపు జరిమానాలు, అదనపు చార్జీలను గమనించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్