PPF Loan: మీరు పీపీఎఫ్‌ ఖాతాపై సులభంగా లోన్ తీసుకోవచ్చు.. దరఖాస్తు చేసే ముందు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి

|

Jul 15, 2022 | 10:17 AM

PPF Loan: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పదవీ విరమణ విషయంలో ఇది చాలా మంచి ఎంపిక..

PPF Loan: మీరు పీపీఎఫ్‌ ఖాతాపై సులభంగా లోన్ తీసుకోవచ్చు.. దరఖాస్తు చేసే ముందు ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి
Ppf Loan
Follow us on

PPF Loan: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ముఖ్యంగా పదవీ విరమణ విషయంలో ఇది చాలా మంచి ఎంపిక. ఇది పన్ను ఆదా చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది. PPF వడ్డీ, మెచ్యూరిటీ డబ్బుపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో చేసిన పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు PPF పై కూడా లోన్ తీసుకోవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో జమ అయిన సొమ్ముపై రుణం మొత్తం ఆధారపడి ఉంటుంది. మీకు కావాలంటే, మీరు రెండుసార్లు PF పై లోన్ తీసుకోవచ్చు. కానీ మొదట తీసుకున్న రుణం తిరిగి చెల్లించినప్పుడే రెండో సారి తీసుకోవడానికి వీలవుతుంది.

PPF ఖాతాపై రుణం తీసుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. రుణం తీసుకోవడానికి అర్హత ఏమిటి? వడ్డీ రేటు ఎంత? మీరు ఖచ్చితంగా ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. మీరు వడ్డీపై శ్రద్ధ చూపకపోతే ఆ తర్వాత రుణం మీకు ఖరీదైనదిగా మారవచ్చు. అందుకే PPFపై రుణం కోసం అవసరమైన 5 విషయాలను చూద్దాం.

  1. ఎవరు రుణం తీసుకోవచ్చు:
    PPF ఖాతా తెరిచిన వెంటనే మీరు రుణం తీసుకోలేరు. ఖాతా తెరిచిన 3వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం మధ్య రుణం తీసుకోవచ్చు. మీరు 2020-21లో PPF ఖాతాను తెరిచారని అనుకుందాం.. అప్పుడు మీరు 2022-23లో మాత్రమే PPFపై రుణం తీసుకోవచ్చు. 36 నెలల కాలవ్యవధి కలిగిన PPFలో స్వల్పకాలిక రుణం అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి. ఆ తరువాత ఏదైనా సందర్భంలో దాని డబ్బు చెల్లించాలి.
  2. ఎంత వడ్డీ వసూలు చేస్తారు?: పీపీఎఫ్‌పై తీసుకున్న రుణం మొత్తంపై మీరు ఒక శాతం వడ్డీని చెల్లించాలి. అయితే 36 నెలలలోపు PPF లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించే వినియోగదారులకు ఒక శాతం వడ్డీ రేటు ఉంటుంది. 36 నెలల తర్వాత రుణ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే, వడ్డీ రేటు సంవత్సరానికి 6 శాతం ఉంటుంది. రుణం జారీ చేయబడిన తేదీ నుండి ఈ రేటు జోడించబడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. లోన్‌లో ఎంత మొత్తం తీసుకోవచ్చు: పీపీఎఫ్ ఖాతా తెరిచిన రెండో ఏడాది ముగిసే సమయానికి ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌లో 25% రుణంగా తీసుకోవచ్చు. మీరు మూడవ సంవత్సరంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కస్టమర్ 2022-23 కాలానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారని అనుకుందాం.. ఆ తర్వాత మార్చి 31, 2021 నాటికి, PPF ఖాతాలోని 25 శాతం బ్యాలెన్స్‌ను లోన్‌గా తీసుకోవచ్చు. ఇది గరిష్ట రుణ మొత్తం అవుతుంది.
  5. ఏ ఫారమ్ నింపాలి: PPFపై రుణం తీసుకోవడానికి కస్టమర్ ఫారమ్ D నింపాలి. ఈ ఫారమ్‌లో PPF ఖాతా సంఖ్య, ఎంత మొత్తంలో రుణం తీసుకోవాలో సమాచారం ఇవ్వాలి. ఫారమ్‌పై ఖాతాదారు సంతకం చేయాలి. PPF పాస్‌బుక్‌ను ఈ ఫారమ్‌తో జత చేసి, PPF ఖాతా నడుస్తున్న బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు సమర్పించాలి.
  6.  మీరు ఎన్ని సార్లు లోన్ తీసుకోవచ్చు: PPF ఖాతాపై రుణాన్ని ఆర్థిక సంవత్సరంలో ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. కానీ మీరు మొత్తం పదవీ కాలంలో ఒకటి కంటే ఎక్కువసార్లు లోన్ తీసుకోవచ్చు. మీరు రెండవసారి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, ముందుగా రుణాన్ని తిరిగి చెల్లించాలని గుర్తుంచుకోవాలి. లేకపోతే మీరు PPF పై మరొకసారి రుణాన్ని పొందలేరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి