AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Voter ID Link: ఆధార్, ఓటర్ కార్డు లింక్ కాలేదా? లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయవచ్చా? లేదా?

ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే తేదీని ప్రకటించింది. ఈసారి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. దీని ప్రకారం ఎన్నికల ముందు ఓటర్లు ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించింది. కానీ మీరు దాని కోసం టెన్షన్‌ పడాల్సిన..

Voter ID Link: ఆధార్, ఓటర్ కార్డు లింక్ కాలేదా? లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయవచ్చా? లేదా?
Voter Id
Subhash Goud
|

Updated on: Mar 24, 2024 | 9:31 PM

Share

ఇక మిగిలింది కొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం ఇప్పటికే తేదీని ప్రకటించింది. ఈసారి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. దీని ప్రకారం ఎన్నికల ముందు ఓటర్లు ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సూచించింది. కానీ మీరు దాని కోసం టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. మీరు దీన్ని ఆన్‌లైన్‌లో ఇంట్లోనే చేసుకోవచ్చు.

 అవసరమైన పత్రాలు:

  • ఓటరు గుర్తింపు కార్డు (నంబర్ అవసరం)
  • ఆధార్ కార్డ్ (నంబర్ అవసరం)
  • రిజిస్టర్డ్ మొబైల్, ఇమెయిల్ ఐడిని కూడా గమనించండి.

NVSP (వెబ్‌సైట్) లింక్ నుండి ఆధార్ ఓటర్ ఐడిని ఎలా పొందాలి?

  • ముందుగా NVSP అధికారిక పోర్టల్ –https://www.nvsp.in/ లేదా ఓటర్ సర్వీస్ పోర్టల్ https://voters.eci.gov.inని సందర్శించి లాగిన్ చేసి సైన్ అప్ చేయండి.
  • సైన్ ఇన్ చేసిన తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. ఆ తర్వాత ఖాతాలోకి లాగిన్ చేయడానికి OTPని నమోదు చేయండి.
  • సైన్ ఇన్ చేయకపోతే, మళ్లీ ‘సైన్-అప్’ క్లిక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ఆపై సైన్ ఇన్ చేయడానికి కొనసాగించుపై క్లిక్ చేయండి.
  • ఆపై మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌తో OTTని నమోదు చేయండి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. ఆ తర్వాతే సైన్ అప్ అవుతుంది.
  • ఇప్పుడు కింది స్క్రోల్ చేసి, ఆధార్ సేకరణపై క్లిక్ చేసి, ఫారమ్ 6B నింపండి. ఆ తర్వాత ఆధార్, ఎన్నికల ఫోటో ID అవసరం.
  • ఆ తర్వాత మీ ఓటర్ ఐడీలో నమోదైన EPIC నంబర్‌ను నమోదు చేసి, ‘వెరిఫై అండ్‌ ఫిల్ ఫారమ్’పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన భాషను ఎంచుకుని, ఫారమ్‌ను పూరించండి.
  • ఆ తర్వాత ‘నెక్స్ట్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ‘ఫారం 6B’ పూరించండి. అలాగే అవసరమైన పత్రాలను అందించండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ఓటర్ ఐడీ ఆధార్‌తో లింక్ అవుతుంది.

ఇంకో విషయం గుర్తుంచుకోండి.. ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ సలహా ఖచ్చితంగా తప్పనిసరి కాదు. అయితే ఎన్నికల రిగ్గింగ్‌కు గురికాకుండా ఉండాలంటే మాత్రం చేయడమే మంచిది. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించి ఈ సలహా ఇచ్చారు. అందుకే ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయాలని ఎన్నికల సంఘం ఓటర్లకు సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి