Electric Vehicles: పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ బెటరా? భారమా?
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. అనుకున్నట్లుగానే చాలా కంపెనీలు భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. టాటా మోటార్స్ ఈ ధరను తగ్గించిన తరువాత... భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం సులభం అయింది. పెట్రోల్ కారుతో పోలిస్తే..
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. అనుకున్నట్లుగానే చాలా కంపెనీలు భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి. టాటా మోటార్స్ ఈ ధరను తగ్గించిన తరువాత… భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం సులభం అయింది. పెట్రోల్ కారుతో పోలిస్తే EV ప్రారంభ అదనపు ధరను తిరిగి పొందేందుకు కస్టమర్లకు తక్కువ సమయం పడుతుంది.
EVలను పెట్రోల్ కార్లతో పోల్చినప్పుడు.. ఇంధనంపై దీర్ఘకాలిక పొదుపు , మెయింటినెన్స్ ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అది ఎలాగో ఓ ఉదాహరణ తెలుసుకుందాం.పెట్రోల్ మోడల్ Tiago XTA ఎక్స్-షోరూమ్ ధర 6 లక్షల 95 వేల రూపాయిలు. ఇక ఎలక్ట్రిక్ మోడల్ Tiago EV XT మీడియం రేంజ్ ధర 8 లక్షల 99 వేల రూపాయిలు. EV మోడల్‌పై రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువగా ఉన్నా.. దాని ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ లెక్క చూస్తే.. Tiago EV దాదాపు లక్షా 60 వేల రూపాయిలు ఎక్కువని అర్థమవుతోంది. అయితే పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు బెటరా..? లేక భారమా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.