Life Insurance: మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు

| Edited By: Ravi Kiran

May 30, 2023 | 1:25 PM

ప్రస్తుతం చాలా మంది బీమా పాలసీలు తీసుకుంటున్నారు. గతంలో పాలసీలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెద్దగా లేకపోయినా.. కరోనా మహమ్మారి సమయంలో ఇన్సూరెన్స్‌లు చేసేకునేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది..

Life Insurance: మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఇన్సూరెన్స్‌ తీసుకునే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు
Life Insurance
Follow us on

ప్రస్తుతం చాలా మంది బీమా పాలసీలు తీసుకుంటున్నారు. గతంలో పాలసీలు కొనుగోలు చేసేవారి సంఖ్య పెద్దగా లేకపోయినా.. కరోనా మహమ్మారి సమయంలో ఇన్సూరెన్స్‌లు చేసేకునేవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. పాలసీలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఇక టర్మ్‌ బీమా పాలసీ తీసుకునేటప్పుడు ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నాయా.. అని ప్రత్యేకంగా అడుగుతుంటాయి బీమా కంపెనీలు. ఈ అలవాట్లు ఉంటే ఆ వ్యక్తికి రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీమా పాలసీ ఇచ్చేటప్పుడు బీమా సంస్థలు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాయి. పాలసీ ప్రతిపాదిత పత్రం పూరించేటప్పుడు ఈ అలవాట్లు ఉన్నాయని పేర్కొంటే బీమా కంపెనీలు దానికి తగ్గట్లుగా అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. గతంలో ఈ అలవాట్లు ఉండి, ఇప్పుడు వాటిని పూర్తిగా మానేస్తే అలాంటప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెనీ నిబంధనలను బట్టి ప్రీమియం ఉంటుంది.

గతంలో అలవాటు ఉండి, మూడేళ్ల క్రితం నుంచి ధూమపానానికి దూరంగా ఉన్నప్పుడు కొన్ని బీమా సంస్థలు వారిని సాధారణ వ్యక్తులుగానే పరిగణిస్తున్నాయి. జీవిత బీమా అంటే ఒక నమ్మకమైన ఒప్పందం. పాలసీదారుడికి ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఆ పాలసీ నుంచి వచ్చే డబ్బే ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆధారం అవుతుంది. పాలసీ తీసుకునేటప్పుడు నిజాలను దాచిపెట్టారనుకుందాం.. పాలసీ క్లెయిమ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ విషయాలు బయటపడితే పరిహారం ఇవ్వకుండా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ పాలసీ 25-30 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ వ్యవధిలో ఈ తరహా కొత్త అలవాట్లు రావచ్చు. ఇలాంటప్పుడు బీమా సంస్థకు ఆ విషయాన్ని తెలియజేయాలి. అప్పుడు పాలసీ నిబంధనలను బట్టి కాస్త అధిక ప్రీమియం వసూలు చేసే అవకాశం ఉంది. అందుకు సిద్ధంగా ఉండాలి. ఇలా మద్యం అలవాటు ఉన్నట్లు ముందుగానే తెలియజేస్తే తర్వాత క్లెయిమ్‌ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా మద్యం అలవాటు ఉన్నవారికి పాలసీ కవరేజీ ఉంటుందని తెలుసుకోవడం మంచిది.

క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు..

మీకు మద్యం అలవాటు ఉండి.. పాలసీ తీసుకునే సమయంలో అబద్దం చెబితే క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. ఏదైనా అనారోగ్యం సమయంలో ఆల్కహాల్‌ కారణంగా లివర్‌ చెడిపోవడం, శరీరంలో ఇతర అవయవాలు చెడిపోవడం వల్ల పరీక్షల్లో ఆల్కహాల్‌ అని తేలితే ఇబ్బందే. ఇలా మద్యం కారణంగా మీరు అనారోగ్యానికి గురైతే బీమా కంపెనీలు క్లెయిమ్‌ విషయంలో తిరస్కరిస్తాయి. అందుకే ముందుగానే నిజాన్ని చెప్పేయడం బెటర్‌. తర్వాత ఎలాంటి సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి

ఆల్కహాల్ శాతం ఎంత ఉండాలి?

సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) రక్తంలో ఆల్కహాల్‌ కంటెంట్‌ స్థాయిని నిర్ణయిస్తుంది. సీడీసీ వివరాల ప్రకారం.. మన శరీరంలో ఆల్కహాల్ శాతం ఎంత ఉండాలి అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.100 మి.లీ రక్తానికి 30మిల్లీ గ్రాముల ఆల్కహాల్‌ స్థాయి ఉండాల్సి ఉంటుంది. పాలసీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బీమా కంపెనీలు ప్రమాదాన్ని అంచనా వేస్తాయి.

పాలసీ కొనుగోలు సమయంలో అబద్దం చెబితే ఏమవుతుంది?

కాగా, పాలసీ కొనుగోలు చేసే సమయంలో పాలసీదారుడు అబ్దం చెబితే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మద్య పానం అలవాటు లేదని చెప్పి, ఆల్కహాల్‌ కారణంగా శరీరంలో ఏదైనా సమస్య తలెత్తితే బీమా కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయి. మీ ఆరోగ్య సమస్యల గురించి ముందుగానే చెబితే మంచిది. అందుకే ముందుగానే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం బెటర్‌.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన ఆధారంగా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి