LIC Aadhar Shila Scheme: ప్రజల కోసం ఎల్‌ఐసీ రకరకాల పథకాలను అందుబాటులోకి తీసకువస్తోంది. భారతీయ జీవిత బీమా నుంచి మరో కొత్త స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. పెట్టుబడుల కోసం ‘ఆధార్ శిలా’ అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్ భౄరతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకం తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో 4 లక్షలు రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో చేరాలనుకునే మహిళలు రోజుకు తక్కువ మొత్తంతో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు.
అయితే ఈ ఎల్‌ఐసీ ఆధార్ శిలా పథకంలో పెట్టుబడి పెట్టినవారికి.. పెట్టుబడులపై రాబడి హామీతో పాటు..ఎల్ఐసీ రక్షణ కవరేజీ కూడా అందిస్తోంది. రోజుకు 29 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. అంటే సంవత్సరానికి అన్నీ ట్యాక్స్ లతో కలిపి రూ.10,959 అవుతుంది. ఇలా వరుసగా 20 సంవత్సరాల పాటు మొత్తం రూ.2,19,180 చెల్లించాలి. కానీ మెచ్యూరిటీ తీరిన తర్వాత ఎల్‌ఐసీ నుంచి మనకు 4 లక్షల వరకు అందుతాయి. అంటే సగానికి సగం లాభం పొందే అవకాశం ఉంటుందన్నట్లు. ఆసక్తి ఉన్నవారు ఎల్‌ఐసి ఏజెంట్‌ను సంప్రదించడం ద్వారా లేదా సమీపంలోని బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారులు తమ ప్రీమియంలను నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన చెల్లించడానికి ఎంచుకోవచ్చు.