ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి చేరుకుంటే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్‌ఐసీ షేర్లు మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. లిస్టింగ్‌లోనే నష్టాల బాట పట్టిన ఎల్ ఐసీ షేర్లు పెరుగుతాయని పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడంలేదు. నెలలు గడిచేకొద్దీ ఎల్ఐసీ షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ షేర్ల ఐపీఓతో మార్కెట్‌లో పెద్ద హంగామా జరిగింది. ఎల్ఐసీ షేర్ల కేటాయింపుల్లో షరతు పెట్టారు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి రోడ్ షోస్ నిర్వహించారు. ఎల్ఐసీ ఐపీఓలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించారు కానీ, ఐపీఓ ప్రారంభంలోనే ఎల్ఐసీ షేర్లు నిరాశపరిచాయి.
గణాంకాల ప్రకారం, గత కొంత కాలంగా ఎల్ఐసీ షేర్ల పై రిటైల్ ఇన్వెస్టర్ల నమ్మకం తగ్గుతోంది. సెకండ్ క్వార్టర్‌లో 2.65 లక్షల మంది ఇన్వెస్టర్లు ఎల్ఐసీ షేర్లను వదిలించుకున్నారు. ఎల్ఐసీ షేర్ల పతనాన్ని బట్టి రిటైల్ ఇన్వెస్టర్లు షేర్లను వదిలించుకోవడం సమంజసమనిపిస్తుంది. ఎల్ఐసీ ఐపీఓలో షేర్ల ఇష్యూ ధర రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 904 , పాలసీదారులకు రూ. 889, సాధారణ ఇన్వెస్టర్లకు రూ. 949తోప్రారంభమైంది. మే17న రూ. 872లకు ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ జరిగింది. మొదటి రోజు నుంచే ఎల్ఐసీ ఇన్వెస్టర్లు నష్టాలను చూస్తున్నారు. శుక్రవారం నాడు బీఎస్‌ఈలో రూ. 585 వద్ద ఎల్ఐసీ షేర్లు ట్రేడ్ అవ్వగా అంతకు ముందు రూ. 588 ఆల్‌టైమ్ కనిష్ట
స్థాయిలో ట్రేడయ్యాయి.
కొందరు ఇన్వెస్టర్లు ఎల్ఐసీ షేర్లను తక్కువ రేటులో కొనేందుకు ఈ ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని అవకాశంగా చూస్తున్నారు. గణాంకాల ప్రకారం, జూన్ క్వార్టర్ ముగిసే నాటికి రిటైల్ ఇన్వెస్టర్లు వద్ద 11.86 కోట్ల షేర్లు ఉండగా, ఈ సంఖ్య సెప్టెంబర్ నాటికి 12.21 కోట్ల షేర్లకు చేరింది. 3 నెలల్లో ఎల్ఐసీ ఇన్వెస్టర్లు 35 లక్షల షేర్లను కొన్నారు.
ఈ కాంలలో ఫారిన్ పోర్ట్ ఫోలియా ఇన్వెస్టమెంట్ వారు ఎల్ఐసీ షేర్లపై ఆసక్తి కనబరిచారు వారు 33 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్స్‌పై నమ్మకం తగ్గడంతో వాటి హోలండింగ్ 0.1 శాతం తగ్గింది. ఎల్‌ఐసీ షేర్ల భవిష్యత్‌ని పరిశీలిస్తే , ఈ షేర్ పర్ఫార్మెన్స్ దారుణంగా ఉన్నప్పటికీ బ్రోకరేజ్ సంస్థలు కొనాలనే సూచిస్తున్నాయి. విదేశీ బ్రోకరేజ్ సంస్థ సిటీ బయ్యింగ్ టార్గెట్ రూ.1000 ఇవ్వగా, మోతీ లాల్ ఓస్వాల్ రూ. 830, ఎంకే గ్లోబల్ సంస్థ రూ. 800 టార్గెట్ ధర ఇచ్చాయి.
షేర్ల పతనంతో ఎల్ ఐసీ కంపెనీ వ్యాపారం పై ప్రభావం పడింది. చరిత్రలో అత్యల్ప లాభాలను ఎల్ఐసీ చూసింది. మార్చ్ క్వార్టర్‌లో 15 శాతం ఉన్న ఎల్‌ఐసీ మార్జిన్ జూన్ నాటికి 13.6 శాతానికి దిగజారింది. ఇతర కంపెనీలను పరిశీలిస్తే ఎస్‌బీఐ లైఫ్ , ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మార్జిన్ 30 శాతం ఉండగా, హెచ్ డీఎఫ్ సీ లైఫ్ మార్జిన్ 27 శాతం ఉంది. ఎల్ఐసీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి నూతన వ్యాపార మార్గాలను అను సరించాలని దీపం సెక్రటరీ తుహీన్ కాంత్ పాండే అన్నారు. ఎల్‌ఐసీ యాజమాన్యం వైవిధ్యంగా ఆలోచించాలని మార్కెట్‌లో ఎల్ ఐసీ షేర్ల లిస్టింగ్‌తో కొత్త కథ మొదలైందని 20 ఏళ్ల వ్యాపార ప్రణాళికతో కొత్త వ్యూహాలతో ఎల్ఐసీ ముందుకెళ్లాలని ఆయన అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..