LIC Jeevan Akshay Pension Plan: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి

|

Jun 04, 2021 | 9:09 AM

LIC Jeevan Akshay Pension Plan: ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి..

LIC Jeevan Akshay Pension Plan: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి
Lic Jeevan Akshay
Follow us on

LIC Jeevan Akshay Pension Plan: ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే విధంగా ఎంచుకుంటున్నారు వినియోగదారులు. ఎల్‌ఐసీ స్కీమ్‌లో భాగంగా ‘జీవన్‌ అక్షయ్‌’ పాలసీ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత అధిక వడ్డీ సంపాదించడమే కాకుండా నిర్ణీత కాలం తర్వాత నెల వారీ లేదా మూడు నె లలు, వార్షిక ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించవచ్చు. 30 నుంచి 85 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ జీవన్‌ అక్షయ్‌ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోను తీసుకోవచ్చు. ఈ పథకంలో సింగిల్‌ ప్రీమియంగా కనీస పెట్టుబడి లక్ష రూపాయలు.

ఉమ్మడి పెట్టుబడి దారులకు జీవన్‌ అక్షయ్‌ విధానం

ఉమ్మడి పెట్టుబడిదారులు కూడా జీవన్ అక్షయ్‌ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ప్రతి పెట్టుబడిదారుడు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత నెలనెల పెన్షన్‌ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ పాలసీలో ఎంత పెట్టుబడి పెడితే అంత పెన్షన్‌ లభిస్తుంది. జీవన్‌ అక్షయ్‌ పాలసీలో అందుబాటులో ఉన్న పదికిపైగా యాన్యుటీలను ఎల్‌ఐసీ అందిస్తోంది. పాలసీని ప్రారంభంలోనే పాలసీదారుకు హామీ యాన్యుటీ రేటు లభిస్తుంది. పాలసీలో పెట్టుబడులను బట్టి రాబడి మారుతుంది.

ఉదాహరణకు.. పెట్టుబడిదారుడు జీవన్‌ అక్షయ్‌ పాలసీలో ఒకేసారి రూ.9,16,200 జమ చేసినట్లయితే.. రూ.6,859 రాబడి పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి రూ.86,265 లేదా అర్ధ సంవత్సరానికి రూ42,008, లేదా త్రైమాసిక ప్రాతిపదికన రూ.20,745 పొందుతారు. అలాగే రూ. 30 లక్షల పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 14,000 పెన్షన్ పొందవచ్చు. అలాకాకుండా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే.. రూ. 1,68,000 డబ్బు అందుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ స్కీమ్‌లో పాలసీదారుడు బ్రతికున్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే పెన్షన్ ఆగిపోయి పెట్టుబడి తిరిగి వస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు

Indian Railways Records: కరోనా మహమ్మారి సమయంలో సరుకుల రవాణాలో రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ