Lemon Grass: బిజినెస్ చేసుకునేందుకు రకరకాల మార్గాలున్నాయి. మంచి లాభాలను పొందేందుకు వివిధ వ్యాపారాలను ఎంచుకోవచ్చు. కేవలం ఒక హెక్టారు భూమిలోన లెమన్ గ్రాస్ (Lemon Grass).దీనిని నిమ్మ గడ్డి అని కూడా ఉంటారు. దీనిని సాగు చేయడం ద్వారా ఏడాదికి 4 లక్షల రూపాయలను సంపాదించుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక కార్యకమమైన ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat)లో కూడా మోడీ ఈ లాభాదాయకమైన వ్యాపారం (Business) గురించి ప్రస్తావించారు. ఈ వ్యవసాయ విధానం అనుసరించడం ద్వారా రైతులు తమకు తాము అభివృద్ది చెందడమే కాకుండా దేశ అభివృద్దికి కూడా తమ వంతు సాయం చేయవచ్చని పేర్కొన్నారు. లెమన్ గ్రాస్ (Lemon Grass) పంట కేవలం మూడు నుంచి ఐదు నెలల్లోనే కోతకు వస్తుంది. దీంతో త్వరగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పంట ద్వారా ఏడాదికి సుమారు రూ.4 లక్షల వరరకకు ఆదాయం రాబట్టుకోవచ్చు.
లెమన్ గ్రాస్‌లో మంచి ఔషధ గుణాలు..
కాగా, లెమన్ గ్రాస్‌లో మంచి ఔషధ గుణాలు ఉండటం వల్ల సోపుల తయారీ నుంచి వివిధ ఔషధాల తయారీ వరకు వాడుతుంటారు. దీంతో దీని నుంచి తీసిన ఆయిల్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
మెడిషిన్ల తయారీలో..
కాగా, దీనిని ఔషధాల తయారీలో దీనిని వాడుతారు. అంతేకకాకుండా కాస్మోటిక్స్, సోపులు, ఆయిల్స్, వాటిలో వినిగిస్తుంటారు. దీంతో మార్కెట్లో కూడా మంచి ధర ఉంది. అంతేకాకుండా హెర్బల్ ప్రొడక్టుల వాడకం విపరీతంగా పెరుగుతుండటంతో లెమన్ గ్రాస్‌కు మంచి డిమాండ్ పెరుగుతోంది. దీనిని పండించేందుకు నీటి అవసరం కూడా తక్కువే. అంతేకాకుండా ఈ పంటకు ఎరువులు కూడా తక్కువే. ఈ లెమన్ గ్రాస్ రుచికరంగా ఉండకపోవడంతో పశువులు కూడా మేసేందుకకు పెద్దగా ఇష్టపడవు.
ఏయే నెలలు పంట సాగుకు అనువైన సమయం:
ఈ పంటను సాగు చేసేందుకు ఫిబ్రవరి-జూలై మధ్యలో ఈ పంట పండించేందుకు అనువైన సమయమని చెబుతున్నారు. కనీసం ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలోఓ పంట చేతికి వస్తుంది. దీని నుంచి ఆయిల్ తీస్తారు. మార్కెట్లో ఒక్కో లీటరు ఆయిల్ సుమారు రూ.1500 వరకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి: