Smart Phone: ఐఫోన్ లుక్‌లో లావా ఫోన్.. ఫీచర్స్ అదిరిపోయాయిగా..!
స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఐఫోన్ అంటే ప్రత్యేక క్రేజ్. ఐఫోన్ చేతిలో అదో గౌరవంగా ఫీలయ్యే వారు చాలా మంది ఉంటారు. ఇటీవల కాలంలో మధ్యతరగతి యువత కూడా ఐఫోన్ వాడకాన్ని ఇష్టపడుతుంది. అయితే ఐఫోన్ ధర చాలా ఎక్కువగా ఉండడంతో సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా కొనుగోలు చేసే వారు చాలా మంది ఉంటారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేలా ప్రముఖ కంపెనీ లావా ఐఫోన్ లుక్‌లో నయా స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది.

లావా కంపెనీ షార్క్ 5జీ పేరుతో బడ్జెట్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఐఫోన్ డిజైన్‌తో మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కేవలం రూ. 7,999కే ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. షార్క్ 5జీ మే 23 నుంచి చాలా రిటైల్ అవుట్‌లెట్‌లతో పాటు లావా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుందని కంపనీ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా వారెంటీ స్కీమ్‌లో భాగంగా హోమ్ రిపేర్ సర్వీస్ కూడా ఉంది. షార్క్ రూ. 10,000 కంటే తక్కువ ధరకు 5జీ కనెక్టివిటీని అందించే అతి కొద్ది స్మార్ట్‌ఫోన్‌లలో లావా షార్క్ 5జీ నిలుస్తుంది. ఈ ఫోన్ రెడ్‌మీ ఏ4 5జీ, రెడ్‌మి 14సీ 5జీ ఫోన్స్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
షార్క్ 5జీ ఎంట్రీ-లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌కు ఐఫోన్ 16 లాగా కనిపించే డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. స్టెల్లార్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద కెమెరా హంప్‌తో పాటు రెండు లెన్స్‌లతో నిగనిగలాడే బ్యాక్ ప్యానెల్‌తో ఆకట్టుకుంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే షార్క్ 5జీ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ రిజుల్యూషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 6 ఎన్ఎం యూనిసాక్ టీ765 చిప్‌సెట్‌తో వచ్చే ఈ ఫోన్ పని తీరు విషయంలో రాజీ ఉండదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 4 జీబీ + 64 జీబీ వేరియంట్‌లో లభించే ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ బ్యాకప్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే 10 వాట్స్ చార్జర్‌తో వచ్చే ఈ ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిస్తుంది.
ఆండ్రాయిడ్-15తో పని చేసే ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తేంది13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమేరాతో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ ఫోన్ ఐపీ-54 సర్టిఫికేషన్‌తో వస్తుంది. రెండు రంగుల్లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. షార్క్ 5జీ ఫోన్ లావా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు వివిధ రిటైల్ అవుట్‌లెట్‌ల కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








