ITR Filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం మర్చిపోయారా? అయినా మీకు ఫైన్‌ పడదు! ఎందుకో తెలుసా?

2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి జూలై 31 నాటికి ప్రభుత్వం విధించిన గడువు పూర్తయిపోయింది. ఆ రోజు వరకూ దేశ ‍వ్యాప్తంగా 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆదాయ పన్నుల శాఖ ప్రకటించింది. ఇప్పటికీ ఐటీఆర్‌ దాఖలు చేయని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాస్తవానికి గడువులోగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయకపోతే ఆదాయ పన్నుల శాఖ పెనాల్టీ విధిస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

ITR Filing: ఐటీఆర్‌ ఫైల్‌ చేయడం మర్చిపోయారా? అయినా మీకు ఫైన్‌ పడదు! ఎందుకో తెలుసా?
ITR Filing

Updated on: Aug 05, 2023 | 4:15 PM

ఆదాయ పన్ను దాఖలు చేయడానికి గడువు ముగిసింది. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి జూలై 31 నాటికి ప్రభుత్వం విధించిన గడువు పూర్తయిపోయింది. ఆ రోజు వరకూ దేశ ‍వ్యాప్తంగా 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆదాయ పన్నుల శాఖ ప్రకటించింది. ఇప్పటికీ ఐటీఆర్‌ దాఖలు చేయని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాస్తవానికి గడువులోగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయకపోతే ఆదాయ పన్నుల శాఖ పెనాల్టీ విధిస్తుంది. అది మీ ఆదాయం, పన్నులు చెల్లించే మొత్తాన్ని బట్టి రూ. 1,000 నుంచి 5,000 వరకూ ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అది ఎలా? ఎవరికి పెనాల్టీ వేయలేరు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆలస్యంగా పన్ను చెల్లిస్తే నష్టం..

మీరు ఐటీఆర్‌ ఇప్పటి వరకూ ఫైల్‌ చేయకుండా.. ఇప్పుడు చేయాలని ప్లాన్‌ చేస్తుంటే ముందుగా కొంత సమాచారాన్ని మీరు సేకరించాల్సిన అవసరం ఉంది. మీ ఐటీఆర్‌ను ఆలస్యంగా ఫైల్ చేయడం వల్ల చాలా నష్టాలు వస్తాయి. అందులో ఒకటి మీరు ఆదాయపు పన్ను మొత్తంపై వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు ఆలస్యంగా ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నప్పుడు, మీరు నష్టాలను (ఇంటి ఆస్తి నష్టాలు మినహా) సెట్ చేయడం లేదా ముందుకు తీసుకెళ్లడం లేదా చాప్టర్ VI-A కింద నిర్దిష్ట తగ్గింపులను క్లెయిమ్ చేయలేరు.

పెనాల్టీ ఎవరికి పడదంటే..

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేయాలనుకొనే అందరికీ పెనాల్టీ పడదు. స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించని వ్యక్తులు ఆలస్యంగా ఐటీఆర్‌ దాఖలు చేసినా వారికి పెనాల్టీ విధించరు. ఈ మినహాయింపు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్‌లో ఉంది. అయితే, మీరు గడువును మించిన తర్వాత ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే, మీరు నెలకు 1% చొప్పున బకాయి ఉన్న పన్ను మొత్తంపై వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని గమనించాలి. కాబట్టి, మీరు మీ ఐటీఆర్‌ను ఎంత త్వరగా సమర్పిస్తే అంత వడ్డీ తక్కువ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మినహాయింపుల్లో తేడాలు ఇలా..

కొత్త ఆదాయపు పన్ను విధానంలో వ్యక్తులందరికీ రూ. 3,00,000 వరకు నిర్ణీత వ్యక్తిగత ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. అయితే, పాత పన్ను విధానంలో, ప్రాథమిక మినహాయింపు పరిమితి వయస్సు ఆధారంగా మారుతుంది. 60 ఏళ్లలోపు వ్యక్తులకు, పరిమితి రూ. 2,50,000 కాగా, 60 నుంచి 80 ఏళ్ల మధ్య ఉన్న సీనియర్ సిటిజన్లకు రూ. 3,00,000 పరిమితి ఉంటుంది. 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లు రూ. 5,00,000 అధిక ప్రాథమిక మినహాయింపు పరిమితిని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..