Petrol Pump: పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారుల కోసం 6 ఉచిత సర్వీసులు.. అవేంటో తెలుసా..?

|

Apr 18, 2023 | 11:20 AM

పెట్రోల్‌ బంకులు ఎప్పుడు వాహనదారులతో బిజీగా ఉంటాయి. పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూలు కడుతుంటారు. ఎప్పుడు రద్దీగా ఉండే వాటిలో పెట్రోల్‌ బంకులు కూడా ఒకటి. ఎన్ని బంకులు ఉన్నా.. అన్ని బ్యాంకుల్లోనే వాహనదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ దొరకడమే కాదు.. ప్రజల కోసం కొన్ని..

Petrol Pump: పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారుల కోసం 6 ఉచిత సర్వీసులు.. అవేంటో తెలుసా..?
Representative Image
Image Credit source: Representative Image
Follow us on

పెట్రోల్‌ బంకులు ఎప్పుడు వాహనదారులతో బిజీగా ఉంటాయి. పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూలు కడుతుంటారు. ఎప్పుడు రద్దీగా ఉండే వాటిలో పెట్రోల్‌ బంకులు కూడా ఒకటి. ఎన్ని బంకులు ఉన్నా.. అన్ని బ్యాంకుల్లోనే వాహనదారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ దొరకడమే కాదు.. ప్రజల కోసం కొన్ని ఉచిత సర్వీసులు కూడా ఉంటాయి. ఇవి ఉచితంగానే ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియవు. సాధార‌ణంగా పెట్రోల్ బంకు య‌జ‌మానుల‌కు ఈ ఆరు సేవ‌ల‌ను అందిస్తామ‌ని ప్ర‌భుత్వాలుకు చెబుతాయి. ఈ ఆరు సేవ‌ల‌ను ప్ర‌జ‌లకు ఉచితంగా అందిస్తేనే పెట్రోల్ బంకుల‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇస్తారు. పెట్రోల్ బంకు య‌జ‌మానులు ఈ ఆరు సేవ‌ల‌ను అందించ‌క పోతే వారిపై ఫిర్యాదు కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు మ‌నం పెట్రోల్ బంకులవారు ఉచితం గా అందించే ఆరు ఉచిత సేవ‌లు ఏంటో తెలుసుకుందాం.

  1. పెట్రోల్ బంకు వ‌ద్ద ప్ర‌ధానంగా ప్ర‌జ‌లకు ఉచితంగా మంచి నీటి సదుపాయం అందించాలి. ఇందు కోసం బంక్‌ డీల‌ర్ ఆర్వో యంత్రం, వాట‌ర్ కనెక్ష‌న్ స్వ‌యంగా పొందాలి. అయితే ఏ బంకుల్లో అయితే ఈ వాటర్‌ సదుపాయం లేకపోతే ఫిర్యాదు చేయవచ్చు.
  2. మూత్ర శాల‌లు, మ‌రుగు దొడ్లను స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగం గా పెట్రోల్ బంకు య‌జ‌మానులు త‌ప్ప‌క నిర్వహించాల్సి ఉంటుంది. దీని పై కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంకో విషయం ఏంటంటే మన ప్రతి లీటర్‌ పెట్రోల్‌లో దాదాపు 4 నుంచి 8 పైసలు మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహనకు బంక్‌ యజమానులకు చెల్లిస్తున్నాము.
  3. ముఖ్యంగా బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కల్తీ జరుగుతుంటుందని ఫిర్యాదులు వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యత ప్రమాణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్క వాహనదారుడికి ఉంటుంది.
  4. ఇక ప్రతి వాహనానికి అంటే టూ వీలర్‌, త్రివీలర్‌, ఫోర్‌ వీలర్‌ ఇలా ఇంకేదైన వాహనం కానీ పెట్రోల్‌ బంకుల్లో ఉచితంగా గాలి నింపాల్సిందే. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
  5. ఇవి కూడా చదవండి
  6. వినియోగ‌దారులకు ఎదైనా గాయం అయినట్లయితే పెట్రోల్‌ బంకుల్లో ప్రథమ చికిత్స చేయాలి. దీని కోసం బంకుల్లో ప్రత్యేకమైన చికిత్స కిట్‌ ఉంచాలి.
  7. వినియోగదారులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైన ఫోన్‌ చేసుకునేందుకు పెట్రోల్‌ బంకుల్లో ఉన్న ఫోన్‌ను వినియోగించుకోవచ్చు.

ఇలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పెట్రోల్‌ బంకుల్లో ఈ సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈ సర్వీసులు అందుబాటులో లేకుండా ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి