ఏటీఎమ్ తెలియని వారుండరు.. సమయానికి చేతిలో డబ్బులేకుంటే బ్యాంకుకు వెళ్లి డబ్బు విత్‌డ్రా చేయనవసరం లేకుండానే ఏవేళలోనైనా దగ్గరిలోని ఏటీఎమ్ సెంటర్‌కి వెళ్లి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఏటీఎమ్ నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే తప్పనిసరిగా ఏటీఎమ్ కార్డు లేదా డెబిట్ కార్డ్‌ని కలిగి ఉండాలి. ఈ కార్డును ఉపయోగించి నగదు డ్రా చేసుకోవచ్చు అలాగే ఏటీఎమ్ ద్వారా నగదు విత్‌డ్రా చేయడంతో పాటు బ్యాంకు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటారు. ఐతే చాలా మంది ఏటీఎమ్ మెషీన్‌ని డబ్బు విత్‌డ్రా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. ఈ మెషీన్ నుంచి డబ్బును విత్‌డ్రా చేయడమే కాకుండా ఇంకా ఈ కింది నాలుగు పనులు చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
ఏటీఎమ్ మెషిన్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే చవరి 10 లావా దేవీలు కూడా ఏటీఎమ్ మెషీన్ ద్వారా తెలుసుకునే వెసులు బాటు ఉంటుందని చాలా మందికి తెలియదు. మీ ఖాతా బ్యాలెన్స్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.
వీసా కార్డ్, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ చెల్లింపులు ఏటీఎమ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఇందుకోసం మీ వద్ద క్రెడిట్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీ పిన్ నెంబర్ గుర్తుంచుకోవాలి.
ఏటీఎం మెషిన్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. ఒక ATM కార్డ్‌తో 16 కంటే ఎక్కువ ఖాతాలకు డబ్బు బదిలీ చేయవచ్చు. ఏటీఎం ద్వారా డబ్బు బదిలీ ప్రక్రియలో ఎలాంటి మోసాలకు తావుండదు. ఇది పూర్తిగా సురక్షితమైనది.
మీ చెక్ బుక్ ఖాళీ అయితే కొత్త చెక్‌బుక్ కోసం బ్యాంకుకు వెళ్లవలసిన అవసరం లేదు. మీ దగ్గరలోని ATM సెంటర్‌ను సందర్శించడం ద్వారా కూడా చెక్ బుక్ పొందవచ్చు. ఏటీఎం ద్వారా కొత్త చెక్ బుక్ కోసం అభ్యర్ధిస్తే మీ అడ్రస్‌కు నేరుగా బ్యాంకు నుంచి చెక్ బుక్ వస్తుంది.
మీరు వినియోగిస్తున్న ATM పిన్‌ని కూడా ఏటీఎమ్ మిషన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. సైబర్ మోసాలకు చెక్ పెట్టాలనంటే మీ ఏటీఎమ్ కార్డు పిన్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటు ఉండాలని బ్యాంకులు సైతం చెబుతుంటాయి.
ఏటీఎం మిషన్ ద్వారా రా మొబైల్ బ్యాంకింగ్ సేవలు కూడా పొందవచ్చు. అంతేకాకుండా మీ యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించవచ్చు. నేటి కాలంలో చాలా మంది నగదు చెల్లింపులకు UPIని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.