Balcony Farming: ఇంట్లోనే ఆర్గానిక్ పంటలను ఇలా చేయండి.. తక్కువ స్థలంలో ఎక్కువ సాగు..
Spinach Farming: తక్కువ సమయంలో మంచి దిగుబడి వచ్చే పంటకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలకూర వంటి బహువార్షిక పంటలకు ప్రాముఖ్యత పెరిగింది. ఈ మధ్య కాలంలో టమాటోకు విపరీతమైన ధర రావడంతో.. మిగిలిన కూరగాయలు, ఆకుకూరల వైపు వెళ్తున్నారు. దీంతో మార్కెట్లో అవి కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి సమయంలో ఇంట్లోనే సాగు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేవారి సంఖ్య పెరుగుతోంది. మనకు ఉన్న కొద్దిపాటి స్థలంలో వీటిని సాగు చేయవచ్చు..

భారతీయ రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో మంచి దిగుబడి వచ్చే పంటకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలకూర వంటి బహువార్షిక పంటలకు ప్రాముఖ్యత పెరిగింది. ఈ మధ్య కాలంలో టమాటోకు విపరీతమైన ధర రావడంతో.. మిగిలిన కూరగాయలు, ఆకుకూరల వైపు వెళ్తున్నారు. దీంతో మార్కెట్లో అవి కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి సమయంలో ఇంట్లోనే సాగు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేవారి సంఖ్య పెరుగుతోంది. మనకు ఉన్న కొద్దిపాటి స్థలంలో వీటిని సాగు చేయవచ్చు. పెద్దగా తీగ వచ్చే పంటలు కాకుండా కొన్ని రకాల కూరగాయలు సాగు చేయవచ్చు. ఇందులో ఆకుకూరలు కూడా తక్కువ స్థలంలో పండించుకోవచ్చు. మెంతీ, కోతిమీర, తోటకూర, పాలకూర వంటి ఆకు కూరలను సాగు చేసుకోవచ్చు. తక్కువ స్థలం ఉంటే అందులో కూడా వీటిని విత్తుకుని మంచి ఆరోగ్యకరమైన పంటలను తీయవచ్చు.వీటిని ఎలాంటి ఎరువులు లేకుండా మంచి పంటలను పండించుకోవచ్చు. దీంతో మనం డబ్బును మిగిలించుకోవచ్చు.. మన కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని అందిచవచ్చు.
పాలకూరను మూడు సీజన్లలో పండిస్తారు. ఫలితంగా, ఇది చాలా లాభదాయకమైన పంట అని చెప్పవచ్చు. అయితే పాలకూర సాగు ఎప్పుడు, ఎలా చేయాలి.. వ్యవసాయ పరిశోధకులు అందించిన పద్దతిలో మంచి దిగుబడిని ఇంట్లోనే పొందవచ్చు. చలికాలంలో మాత్రమే పాలకూర తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజల రోజువారీ ఆహారంలో పాలకూర ప్రధానమైన కూర. అన్ని పప్పుల్లో పాలకూరను వేస్తుంటారు. ఈ కూరగాయతో వివిధ రకాల వంటలను వండుతారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
అంతే కాదు పాలకూర సాగుకు తక్కువ ఖర్చుతో పాటు దిగుబడి కూడా బాగా వస్తుంది. కానీ సాగుకు ముందు బాగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో వాతావరణం పాలకూర సాగుకు అనుకూలంగా ఉంటుంది. పాల కూరను దాదాపు ఏడాది పొడవునా పండించవచ్చు. ఖరీఫ్ సీజన్‌లో జూన్-జూలైలో, రబీ సీజన్‌లో సెప్టెంబర్-అక్టోబర్‌లో విత్తనాలు విత్తుతారు.
విత్తనాలను 10-15 రోజుల వ్యవధిలో విత్తుకోవాలి. దిగుబడి చాలా తక్కువగా ఉన్నందున నేల మందాన్ని బట్టి తగిన సైజులో చదునైన ‘మడులుగా’ తయారు చేసి విత్తనాలను మట్టిలో కలిపి తేలికపాటి నీటిని అందించి విత్తనాలు వేయాలి. అలా కాకుండా కుండీలలో కూడా విత్తుకోవచ్చు. లేదా మన ఇంట్లోని బాల్కనీ, ఇంటి దాబాపైన వేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే సాగు చేయాలని అకుంటున్నామో అక్కడ ఓ కవర్ వేసుకుని అదానిపై మంచి మట్టిని.. దానిలో కొంత కోక్ పీటు వేసుకుని చుట్టు చిన్న చెక్కతో క్లోజ్ చేయండి. అందులో మట్టి పక్కకు రాకుండా కట్టలా దీనిని ఏర్పాటు చేసుకోండి. అంతే అందులో పాలకూర విత్తనాలను నాటుకోండి.
వరుసలలో విత్తనాలు విత్తేటప్పుడు రెండు వరుసల మధ్య 25-30 సెం.మీ దూరం ఉంచాలి. మొక్కలను దట్టంగా నాటితే పంట ఎదుగుదల మందగించే అవకాశం ఉంది. ఇది ఆకు పరిమాణం తక్కువగా ఉంటుంది. పంట నాణ్యత పడిపోతుంది. నేలలో తేమను ఉండేలా చూసుకోండి.. అలా అని ఎక్కువగా ఉండకుండా.. క్రమం తప్పకుండా నీరు పెట్టండి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం