
ప్రస్తుత ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఏఐ.. ఇప్పుడు దాదాపు ప్రపంచంలోని అన్ని రంగాల్లోకి ఇది విస్తరించింది. కొన్ని టెక్ సంస్థలు ఈ ఏఐను ఉపయోగించి.. కొన్ని చాట్‌బోట్స్‌ను కూడా తీసుకొచ్చారు. ఇవి మానవులకు పనిభారం తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే ప్రతి విషయంలో వాళ్లను గైడ్ చేస్తున్నాయి. ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా.. అడిగిన వెంటనే అవి తీర్చేస్తున్నాయి. ఇలా ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల చాట్‌బోట్‌కు జనాలకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, పర్‌ప్లెక్సిటీ ఎక్కవగా వాడకంలో ఉన్నాయి. అయితే వీటి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే నెలకు, లేదా ఏడాదికి వాటికి కొంత మొత్తంలో రిచార్జ్ చేయాల్సి ఉంటంది. కానీ తాజాగా ఆయా కంపెనీ ఇచ్చి కొన్ని ఆఫర్స్‌కు కింద మనం వాటిని ప్రీగా పొందవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.
గూగుల్ జెమినీ ప్రో
గూగుల్ జెమినీతో కలిసిన ప్రముఖ టిక్ సంస్థ రిలయన్స్ తమ జియో కస్టమర్ల కోసం రూ.35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా ఇస్తోంది. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ పొందాలంటే కొన్ని కండీషన్స్ కూడా ఉన్నాయి. కేవలం అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్‌తో రిచార్జ్ చేసుకునే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్‌తో రిచార్జ్ చేసుకున్న కస్టమర్లు జెమిని 2.5 ప్రో మోడల్, 2జీబీ క్లౌడ్ స్టోరేజీ, 3.1 వీడియో జనరేటర్, నానో బనానా ఇమేజ్ జనరేషన్ వంటి ఫీచర్లను ప్రీగా పొందవచ్చు. దీన్ని పొందడానికి మీ ఫోన్‌లో ఉన్న మై జియో యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ ఆఫర్ కనిపిస్తుంది. ఒక వేళ మీ వయస్సు 25 ఏళ్లలోపు ఉంటే మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్- పర్‌ప్లెక్సిటీ ప్రో
ఇక పర్‌ప్లెక్సిటీతో కలిసిన ఎయిర్‌టెల్ కూడా తమ కస్టమర్ల కోసం పర్‌ప్లెక్సిటీ ప్రీమియం వెర్షన్‌ను సంవత్సరం పాటు ఉచితంగా ఇస్తోంది. ఈ ఆఫర్లో కింద కస్టమర్లు మల్టీ మోడల్ రీసెర్చ్, రోజుకు 300కి పైగా ప్రో సెర్చ్‌లు వంటి అన్ని పర్‌ప్లెక్సిటీ ఫీచర్స్‌ను పొందవచ్చు. మీరు ఈ ఆఫర్‌ను పొందాలంటే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని రివార్డ్స్ సెక్షన్ నుంచి పొందొచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులంతా ఈ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.
చాట్‌జీపీటీ గో
ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ఏఐ సంస్థ తన కస్టమర్ల కోసం.. తన చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా చాట్‌జీపీటీ ప్రో మోడల్‌ను మనం నెలకు రూ.399 రిచార్జ్ ప్లాన్‌తో పొందవచ్చు. కానీ ఈ చాట్‌జీపీటీ గోలో మోడల్‌లో అన్‌లిమిటెడ్ మెసెజెస్, ఇమేజ్ జనరేట్, ఫైల్ లేదా ఇమేజ్ అప్‌లోడ్‌లు 10 రెట్లు ఎక్కువగా పొందవచ్చు. ఈ మోడల్‌లో మెమొరీ కూడా సాధారణ చాట్‌జీపీటీ వెర్షన్‌తో పోలిస్తే అధికంగా ఉంటుంది. దీనిని పొందడానికి మీరు చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకుంటే చాలు.
గమనిక: ఈ ఆఫర్స్ కేవలం పరిమిది తేదీల్లో మాత్రమే ఉండవచ్చు.పూర్తి సమాచారం కోసం ఆయా కంపెనీల వెబ్‌సైట్‌లను సంప్రదించండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.