
మీరు ఏదైనా గృహోపకరణం లేదా టెక్ గ్యాడ్జెట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే అనువైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అదిరే ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ పేరిట ఆగస్టు నాలుగున ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు తొమ్మిదో తేదీ వరకూ ఉంటుంది. ఈ సమయంలో వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో విస్తృత శ్రేణి ఉత్పత్తులపై గొప్ప తగ్గింపులు ఆఫర్‌లను పొందవచ్చు. ఐఫోన్ 14, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్ వంటి ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపులు ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. అంతేకాక ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. కొన్ని ఎంపిక చేసిన ఉపకరణాలపై ఏకంగా 80శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది. అలాగే ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డులపై 10శాతం తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఇప్పుడు ఈ ఆఫర్లను ఎలా పొందాలో తెలుసుకుందాం రండి..
కస్టమర్లు క్రెడిట్/డెబిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. అంటే క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ. 1,750 తగ్గింపును పొందుతారు. అదే విధంగా డెబిట్ కార్డులపై గరిష్టంగా రూ. 500 తగ్గింపు లభిస్తుంది. మెయిన్ సేల్ సమయంలో ఒకసారి డిస్కౌంట్‌ని పొందవచ్చు. కిరాణా సామగ్రి అయితే కనీసం రూ. 2000 విలువైనవి కొనుగోలు చేస్తేనే డిస్కౌంట్ పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్ వంటి ఇతర టెక్ గ్యాడ్జెట్లకు కనీసం రూ. 5,000 విలువ పెడితే అప్పుడు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ప్రతి క్రెడిట్ కార్డ్ లావాదేవీకి రూ. 1,750 వరకు బేస్ తగ్గింపును కస్టమర్‌లు పొందవచ్చు. డెబిట్ కార్డ్‌ల కోసం, గరిష్టంగా రూ. 500 తగ్గింపు ఆఫర్‌లో ఉంది. యూపీఐ ద్వారా చేసే లావాదేవీలపై ఆఫర్ వర్తించదు. బంగారం లేదా వెండి నాణేలు, ఆభరణాలపై ఆఫర్ వర్తించదు. కోటక్ మహీంద్రా కస్టమర్లు కిరాణా సామగ్రిపై వారి లావాదేవీ మొత్తం రూ. 2,000 కంటే ఎక్కువ ఉంటే ఆఫర్‌ను పొందవచ్చు. ఇతర వర్గాలకు, కనీసం రూ. 5,000 లావాదేవీ అవసరం. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా వినియోగదారులు ఐదు శాతం క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఉత్పత్తులపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో పలు డిమాండ్ ఉన్న ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 14, శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, శామ్సంగ్ పిక్సల్ 6ఏ, శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 వంటి అధిక ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే ఒప్పో, రెడ్ మీ, వన్ ప్లస్ వంటి అగ్రశ్రేణి స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లకు చెందిన ఉత్పత్తులపై పలు ఆఫర్లు ఉన్నాయి. వీటకి అదనంగా ఐసీఐసీఐ/కోటక్ మహీంద్రా డెబిట్/క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనపు ప్రయోజనాలు పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..