Kia Carens Bookings: కియా నుంచి సరికొత్త కారు.. జనవరి 14 నుంచి బుకింగ్‌

Kia Carens Bookings: కియా మోటార్స్‌ భారత్‌లో త్వరలో తన సరికొత్త మోడల్‌ కారెన్స్‌ జనవరి 14వ తేదీ నుంచి బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. కియా కారెన్స్‌..

Kia Carens Bookings: కియా నుంచి సరికొత్త కారు.. జనవరి 14 నుంచి బుకింగ్‌

Updated on: Jan 05, 2022 | 10:53 AM

Kia Carens Bookings: కియా మోటార్స్‌ భారత్‌లో త్వరలో తన సరికొత్త మోడల్‌ కారెన్స్‌ జనవరి 14వ తేదీ నుంచి బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. కియా కారెన్స్‌ కంపెనీ నాలుగో మోడల్‌. అలాగే 2022లో మార్కెట్లో విడుదలయ్యే కార్లలో ఇది మొదటిది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. కియా కారెన్స్‌ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు 6 నుంచి 7 సీట్లు కలిగి ఉంటుంది. అలాగే ఎంపీవీ ముందు భాగంలో టైగర్‌ నోస్‌ గ్రిల్‌, వెను భాగంలో సెపరేటింగ్‌ లైన్ కూడా చూడవచ్చు.

కియా కొత్తగా మార్కెట్లోకి తీసువస్తున్న ఈ కారు వరుసగా మూడు సీట్లతో ఉంటుంది. ఈ కారు ఐదు విభాగాలలో లభించనుంది. ప్రీమియం, ప్రెస్టేజ్‌, ప్రెస్టేజ్‌ ప్లస్‌, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ కారు1.5 పెట్రోలు, 1.4పెట్రోలు, 1.5డీజిల్‌ ఇంజిన్‌, 6ఎంటీ, 7డీసీటీ, 6ఏటీ ఆప్షన్లు ఉన్నాయి.

2021 డిసెంబర్ లో ఆవిష్కరించిన ఈ కియా “కారెన్స్” కారు మిడ్ సెగ్మెంట్ ఎస్యూవీ/ఎంపీవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మహీంద్రా xuv700, టాటా Safari, ఇన్నోవా crysta, హ్యుండయ్ Alcazar వంటి కార్లకు మంచి పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. అయితే ఇటీవల వచ్చిన హ్యుండయ్ alcazar కస్టమర్లను కాస్త నిరాశపరచడంతో, ప్రస్తుతం రానున్న కారెన్స్‌పై భారీ కియా అంచనాలు పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి:

Car Loan: మీరు సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా..? లోన్‌ కూడా తీసుకోవచ్చు.. గుర్తించుకోవాల్సిన విషయాలు..!

Post office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు పొందవచ్చు.. పూర్తి వివరాలు..!