AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kia Seltos: కియా సెల్టోస్‌పై అదిరే ఆఫర్.. రూ.60 వేల తగ్గింపు..

భారతీయ మార్కెట్ లోకి కియా కంపెనీ వచ్చి ఐదేళ్ల పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐదేళ్ల వార్షికోత్సవం కూడా జరుపుకొంది. ఈ నేపథ్యంలో సెల్టోస్‌ కారుపై రూ. 60 వేల ప్రయోజనాలు, ఐదేళ్ల వారెంటీ ఉంటుందని కియా ప్రకటించింది. అయితే అవి ఏమిటో స్పష్టంగా తెలియజేయలేదు. అధీకృత డీలర్లను అడిగి ఖాతాదారులు తెలుసుకోవాలి.

Kia Seltos: కియా సెల్టోస్‌పై అదిరే ఆఫర్.. రూ.60 వేల తగ్గింపు..
Kia Seltos
Madhu
|

Updated on: Jul 24, 2024 | 12:57 PM

Share

కియా కంపెనీ కార్లకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. ఈ కంపెనీ విడుదల చేసే వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. కియా లేదా కియా మోటార్ కార్పొరేషన్ అనేది దక్షిణ కొరియాకి చెందిన సంస్థ. అయినప్పటికీ మన దేశంలో మంచి ఆదరణ పొందింది. కియా కంపెనీ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సెల్టోస్ కారుపై రూ.60 వేల ప్రయోజనం అందిస్తున్నట్టు ప్రకటించింది.

వార్షికోత్సవ ఆఫర్..

భారతీయ మార్కెట్ లోకి కియా కంపెనీ వచ్చి ఐదేళ్ల పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐదేళ్ల వార్షికోత్సవం కూడా జరుపుకొంది. ఈ నేపథ్యంలో సెల్టోస్‌ కారుపై రూ. 60 వేల ప్రయోజనాలు, ఐదేళ్ల వారెంటీ ఉంటుందని కియా ప్రకటించింది. అయితే అవి ఏమిటో స్పష్టంగా తెలియజేయలేదు. అధీకృత డీలర్లను అడిగి ఖాతాదారులు తెలుసుకోవాలి.

సెల్టోస్ కారుకు ఆదరణ..

కియా నుంచి విడుదలైన ప్రీమియ ఎస్ యూవీలలో సెల్టోస్ బాగా సక్సెస్ అయ్యింది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. అందుకే కియా ఐదేళ్ల వేడుకలలో భాగంగా ఈ కారుపై ప్రయోజనాలు అందజేస్తున్నట్టు ప్రకటించింది.

కియా సెల్టోస్ ధర..

కియా సెల్టోస్ కారు ధర రూ. 10.90 లక్షల నుంచి రూ. 20.37 లక్షల వరకూ ఉంది. అలాగే టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్ అనే మూడు రకాల ట్రిమ్ లలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఈ మోడల్ కు సంబంధించి పది రకాల వేరియంట్లు ఉన్నాయి. కియా కంపెనీ ఈ నెలలో ‘ఎక్స్‌చేంజ్ యువర్ కార్’ అనే అవకాశం కల్పించింది. కొత్త కియా కస్టమర్లు ఈ ఆన్‌లైన్ ఛానెల్‌ని ఉపయోగించి తమ ఎగ్జిటింగ్ కార్ల విలువను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. .

ఇంజిన్ల పనితీరు..

కియా కంపెనీ 2023లో ఒక ముఖ్యమైన అప్ డేట్ చేసింది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కొత్త 1.5 లీటర్ కు మార్చింది. దాని నుంచి 158 బీహెచ్పీ, 253 ఎన్ఎమ్ టార్క్ విడుదలవుతుంది. ఇది కారుకు మరింత శక్తిని అందిస్తుంది. అదే సమయంలో 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు మారలేదు. ఈ రెండు ఇంజిన్లూ 115 బీహెచ్ పీ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

2019లో ప్రవేశం..

సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడంతో కియా 2019లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీతో పాటు క్రాస్ ఓవర్ వంటి ఇతర మోడళ్లను కూడా పరిచయం చేసింది. అయినా వాటన్నింటిలో సెల్టోస్ అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందింది. కార్నివాల్ ప్రీమియం ఎంపీవీ ఈ సంవత్సరం తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే కియా కంపెనీ మన దేశంలో ఈవీ6 ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..