AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman bharat: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సీనియర్ సిటిజన్ల ఖుషీ…అసలు కారణమిదే..!

సీనియర్ సిటిజన్లకు కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వారికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య కవరేజీ లభిస్తుంది. దేశ వ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన ధ్వనంతరి జయంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Ayushman bharat: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సీనియర్ సిటిజన్ల ఖుషీ...అసలు కారణమిదే..!
Ayushman Card
Nikhil
|

Updated on: Nov 01, 2024 | 3:30 PM

Share

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం జేఏవై) పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నసీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా విస్తరించేందుకు కేంద్రమంత్రి వర్గం 2024 సెప్టెంబర్ 11న ఆమోదం తెలిపింది. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబంలోని పెద్దవారికీ వర్తింపజేసింది. దీని వల్ల దేశంలోని దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరనుంది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వాారా ఇప్పటి వరకూ కుటుంబానికి రూ.5 లక్షల ఉచిత వైద్యం కవరేజీ అందేది. ఇప్పుడు 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కవరేజీ పొడిగించారు.

గతంలో కుటుంబ సభ్యులతో కలిసి వారికి కవరేజీ వర్తించేది. అయితే ఇప్పుడు వారికి ప్రత్యేకంగా రూ.5 లక్షలు పెంచారు. అయితే ఈ కవరేజీ వారికి మాత్రమే వర్తిస్తుంది. కుటుంబ సభ్యులతో పంచుకోలేరు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం కింద 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లతో పాటు దాదాపు 4.5 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కవరేజీ అందుతుంది. సాామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారందరూ అర్హులే. పథకాన్ని పొడిగించిన నేపథ్యంలో 70 ఏళ్లు నిండిన వారందరూ ప్రత్యేక మైన కార్డును పొందుతారు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి సీనియర్ సిటిజన్లు ఆరోగ్య కవరేజీ పొందుతున్నారు. ఇప్పుడు కొత్తగా వారికి రూ.5 లక్షలకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సీజీహెచ్ ఎస్, ఈసీహెచ్ ఎస్, సీఏఎఫ్ తదితర పబ్లిక్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీములు కింద ఉన్నవారు.. వాటిని లేదా ఏబీపీఎం జేఏవై పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రైవేటు ఇన్స్యూరెన్స్ లేదా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కవరేజీ ఉన్నవారు కూడా ప్రధానమంత్రి స్కీమ్ కు అర్హులే. ఆయుష్మాన్ భారత్ పథకం గతంలో దేశంలోని 10.74 కోట్ల కుటుంబాలకు రక్షణ కల్పించింది. అంటే దాదాపు 40 మంది జనాభాకు ఉపయోగపడింది. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో 2022లో 12 కోట్ల కుటుంబాలకు విస్తరించింది. ఆశ, ఏడబ్ల్యూడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూహెచ్ తదితర 37 లక్షల మందితో పాటు, వారి కుటుంబాలకు కూడా ఆరోగ్యం కవరేజీ అందజేస్తోంది. కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 70 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారికి ప్రత్యేకంగా రూ.5 లక్షల కవరేజీ ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి