Stock Market: నాలుగు రోజుల్లో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

|

Jan 21, 2022 | 6:12 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన శుక్రవారమూ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 427.44 పాయింట్లు కోల్పోయి 59,037.18 వద్ద స్థిరపడింది.

Stock Market: నాలుగు రోజుల్లో రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
Sensex
Follow us on

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజైన శుక్రవారమూ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 427.44 పాయింట్లు కోల్పోయి 59,037.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 139.85 పాయింట్ల నష్టంతో 17,617.15 వద్ద ముగిసింది. అయితే స్టాక్ మార్కెట్లు గత 4 రోజుల్లో భారీగా నష్టపోయాయి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8 లక్షలకు పైగా నష్టపోయింది.

అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీరేట్లు పెంచుతామన్న ఫెడ్‌ ప్రకటనతో పదేళ్ల బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో మదుపర్లు బంగారం, కరెన్సీ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు వెళ్లారు. ఆసియా మార్కెట్లు నష్టపోవడం కూడా ప్రభావం చూపాయి.

దేశీయంగానూ వడ్డీరేట్ల పెంపు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల ఐసీఐసీఐ, ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లను స్వల్పంగా పెంచాయి. ఇవన్నీ దేశీయంగా రేట్ల పెంపునకు సంకేతాలుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

విదేశీ పెట్టుబడిదారులు(FII) ఇంకా అమ్మకాలకు మొగ్గుచూపారు. అధిక విలువ వద్ద ట్రేడవుతున్న భారత మార్కెట్ల నుంచి డబ్బును ఇతర మార్కెట్లకు తరలిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Read Also.. Fixed Deposite: ఫిక్స్​డ్ డిపాజిట్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..