Tata – Air India: 69 ఏళ్ల తరువాత పుట్టింటికి ఎగిరిపోయింది.. కానీ ప్రభుత్వానికి ఆ సమస్య అలాగే ఉంది..

|

Jan 27, 2022 | 8:06 PM

ఎయిరిండియా ఎగిరిపోయింది. 69 సంవత్సరాల తర్వాత సొంత గూటికి చేరింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి భారత ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన ఎయిర్ లైన్స్(Air India) చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది.

Tata - Air India: 69 ఏళ్ల తరువాత పుట్టింటికి ఎగిరిపోయింది.. కానీ ప్రభుత్వానికి ఆ సమస్య అలాగే ఉంది..
Jrd Tata Getting Out Of An Air India Flight
Follow us on

Tata – Air India: ఎయిరిండియా ఎగిరిపోయింది. 69 సంవత్సరాల తర్వాత సొంత గూటికి చేరింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి భారత ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన ఎయిర్ లైన్స్(Air India) చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. గురువారం ఎయిరిండియాను లాంఛనంగా టాటా గ్రూప్‌(Tata Sons)నకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో 69 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వా త ఎయిరిండియా తిరిగి టాటాల చేతికి చేరింది. టాటా గ్రూప్‌(Tata Group) అనుబంధ సంస్థ టాలేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ గత ఏడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్ల బిడ్‌తో ఏఐని దక్కించుకుంది. గత ఏడాది డిసెంబరు నాటికే ఈ అప్పగింతల కార్యక్రమం పూర్తి కావల్సి ఉండగా.. కాని కొన్ని లాంఛనాలు పూర్తి కావడంలో కొద్దిపాటి ఆలస్యం జరిగింది. నెల రోజులు ఆలస్యంగా ఇది జరుగుతోంది. అప్పగింత ముగిసినప్పటికీ.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నుంచి మాత్రం ఒత్తిడి పెరుగుతోంది.

అంతా ముగిసినా.. ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు  ఇంకా ఆగ్రహంతోనే ఉన్నాయి. తమకు రావాల్సిన ప్రోత్సాహకాలు.. బకాయిలకు ఏ మాత్రం కోత పెట్టినా, రికవరీలకు దిగినా సహించేంది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి ఇండియన్‌ పైలెట్స్‌ గిల్డ్‌ (ఐపీజీ), ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ). ఈ ఉద్యోగ సంఘాలు ఎయిరిండియా సీఎండీ విక్రందేవ్‌ దత్‌కు ఘాటుగా లేఖ రాశాయి. అన్యాయం జరిగితే కోర్టుకెళతామని హెచ్చరించాయి. అలాగే ప్రతి విమాన సర్వీసుకు ముందు విమాన సిబ్బంది బీఎంఐ తనిఖీ చేయాలన్న ఉత్తర్వులను కూడా ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి.

“ఈ రికవరీ వ్యాయామం పూర్తిగా చట్టవిరుద్ధం, ఈ క్రమరాహిత్యాన్ని సరిదిద్దాలని, బకాయి ఉన్న మొత్తాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము” అని రెండు యూనియన్లు పంపిన లేఖలో పేర్కొన్నారు. అదనంగా, మరో రెండు యూనియన్లు – ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ (AIEU), ఆల్ ఇండియా క్యాబిన్ క్రూ అసోసియేషన్ (AICCA) – ఎయిర్‌పోర్ట్‌లలో క్యాబిన్ సిబ్బంది శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) గ్రూమింగ్, కొలవడానికి క్యారియర్ జనవరి 20 నాటి ఆర్డర్‌ను వ్యతిరేకించాయి. వారి విమానాల ముందు. US CDC ప్రకారం, BMI అనేది కిలోగ్రాములలో ఒక వ్యక్తి బరువును మీటర్లలో ఎత్తు చదరపుతో భాగించబడుతుంది. అధిక BMI అధిక శరీర కొవ్వును సూచిస్తుంది. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించడం. మానవత్వం లేనిది అనే కారణంతో ఈ యూనియన్లు ఇటీవల దత్‌కు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ లేఖలు రాశాయి.

ఎల్‌ఐసీ అప్పు ముట్టింది..

అప్పుల కుప్పగా ఉన్న ఎయిర్ ఇండియా.. టాటాలు కొనుగోలు చేయడంతో.. ఎల్‌ఐసీ అప్పులు క్లియర్‌ చేసింది. ఎయిరిండియా నుంచి రావలసిన రూ.3,800 కోట్ల బాకీలను ఎల్‌ఐసీకి చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ హామీ ఉన్న ఈ రుణాన్ని ఎల్‌ఐసీ మంచి లాభంతోనే విక్రయించినట్టు తెలుస్తోంది. ఎయిర్‌ ఇండియా ప్రభుత్వం నుంచి టాటా గ్రూప్‌ చేతికి మారడంతో ఎల్‌ఐసీ ఈ రుణ పత్రాల్ని విక్రయించింది.

ఇవి కూడా చదవండి: PRC: చ‌ర్చ‌లకు రండి.. మీరు మా శ‌త్రువులు కాదు.. ఉద్యోగులకు ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల సూచన..

TATA – Air India: ఎగిరిపో ఆకాశమే హద్దుగా.. టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా..