Mens Underwear Sales: కరోనా తర్వాత పెరుగుతున్న లో దుస్తుల కొనుగోళ్లు.. ప్రజల ఆర్ధిక శక్తి పెరుగుదలకు సంకేతం అంటున్న నిపుణులు..

|

Aug 19, 2024 | 12:17 PM

గత కొన్ని త్రైమాసికాల్లో కోవిడ్ మహమ్మారి కారణంగా దుస్తుల అమ్మకాలు మందగించాయి. అప్పుడు ఆ కంపెనీల వద్ద అదనపు స్టాక్ ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా మునుపటి స్థితికి చేరుకోలేదు. అయితే అరవింద్ ఫ్యాషన్స్, రూపా కంపెనీ , లక్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు తమ అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి.

Mens Underwear Sales: కరోనా తర్వాత పెరుగుతున్న లో దుస్తుల కొనుగోళ్లు.. ప్రజల ఆర్ధిక శక్తి పెరుగుదలకు సంకేతం అంటున్న నిపుణులు..
Mens Underwear Sales
Follow us on

పురుషుల లోదుస్తుల కొనుగోలు రోజు రోజుకీ పెరుగుతోంది. పురుషుల లోదుస్తుల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల ఉంది. జాకీ నుంచి రూపా వరకు అన్నీ ఇన్నర్‌వేర్ కంపెనీలే ఈ విషయాన్ని స్వయంగా చెబుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం ఇవే కంపెనీలు కరోనా కాలం నుండి తమ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు దేశంలోని ప్రముఖ లోదుస్తుల కంపెనీలైన పేజ్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, అరవింద్ ఫ్యాషన్స్, రూపా అండ్ కంపెనీ ఇటీవల తమ ఆదాయ నివేదికలో లోదుస్తుల అమ్మకాలు ముఖ్యంగా పురుషుల లోదుస్తుల అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపాయి. అయితే ఇప్పుడు ఈ లో దుస్తుల అమ్మకం పెరిగుతుందంటే ఇందులో విశేషమేమిటని అనుకుంటున్నారా? ఇది పూర్తిగా నిజం. కానీ ఇది సంతోషకరమైన విషయం. అసలైన, లోదుస్తుల అమ్మకాలు పెరగడం శుభవార్త. ప్రజలకు తగినంత డబ్బు ఉన్నప్పుడు లేదా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ప్రజలు అలాంటి వాటిపై డబ్బు ఖర్చు చేస్తారు. ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం..

ప్రజలు ఎప్పుడు డబ్బు ఖర్చు చేస్తారంటే..

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని.. ఇలాగే ఆర్ధిక వ్యవస్థ కొనసాగుతుందని అన్ని వైపుల నుంచి సూచనలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గింపు, రుతుపవనాల రాకతో కురుస్తున్న వర్షాలు భారతదేశంలోని మంచి ఆర్థిక వృద్ధిని ఇప్పటికే ధృవీకరించాయి. ఇప్పుడు లోదుస్తుల అమ్మకాల గురించి వెల్లడైన ఆసక్తికరమైన సూచిక కూడా అదే సూచించింది. లోదుస్తుల అమ్మకాలు పెరగడం మంచి ఆర్థిక వ్యవస్థకు సంకేతం. కాస్త వింతగా అనిపించినా ఇది పూర్తిగా నిజం.

ఇవి కూడా చదవండి

దీనికి పురుషుల లోదుస్తుల సూచిక అని పేరు పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లినప్పుడు ప్రజలు తమ అవసరాలను తగ్గించుకుంటారు. ఈ కోతలు మొదట లోదుస్తుల వంటి వాటిపై జరుగుతాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లోకి రావడం ప్రారంభించినప్పుడు.. ప్రజలు మళ్లీ ఈ వస్తువులను కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు.

నివేదికలో వెల్లడైంది

టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేజ్ ఇండస్ట్రీస్ నివేదిక ప్రకారం లో దుస్తులను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య పెరిగింది. వీరు కస్టమర్స్ కు తమ స్టాక్ అందుబాటులో ఉండే విధంగా మెరుగైన ఏర్పాట్లు చేసారు. దీని కారణంగా అమ్మకాలు పెరిగాయి. ప్రజలు బట్టలు, ఉపకరణాల కొనుగోలుపై ఖర్చు చేస్తున్నారు. ఇది కాకుండా ఇ-కామర్స్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా లోదుస్తుల కంపెనీలు కూడా లాభపడుతున్నాయి.

గత కొన్ని త్రైమాసికాల్లో కోవిడ్ మహమ్మారి కారణంగా దుస్తుల అమ్మకాలు మందగించాయి. అప్పుడు ఆ కంపెనీల వద్ద అదనపు స్టాక్ ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా మునుపటి స్థితికి చేరుకోలేదు. అయితే అరవింద్ ఫ్యాషన్స్, రూపా కంపెనీ , లక్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు తమ అమ్మకాల్లో మంచి వృద్ధిని నమోదు చేశాయి.

లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలు

అరవింద్ ఫ్యాషన్ కి సంబంధించిన ఇన్నర్‌వేర్ కేటగిరీలో మొత్తం అమ్మకాలు రెండంకెలలో పెరుగుతున్నాయి. అదే సమయంలో ఏప్రిల్-జూన్ కాలంలో ఆదాయం 8% పెరిగిందని, లక్స్ ఇండస్ట్రీస్ కూడా గత త్రైమాసికంలో వాల్యూమ్, ఆదాయంలో 9% పెరుగుదలను నమోదు చేసింది.

VIP, ఫ్రెంచ్ వంటి బ్రాండ్‌లను విక్రయించే VIP దుస్తుల మార్కెటింగ్ సిబ్బంది “మార్కెట్‌లో రికవరీ, వృద్ధి సంకేతాలు” ఉన్నాయని చెప్పారు. కంపెనీ తన మేనేజ్‌మెంట్ గైడెన్స్‌లో సెప్టెంబర్ త్రైమాసికంలో “ఉత్పత్తికి సంబంధించిన మంచి దృశ్యమానత కారణంగా” ఆదాయం 15-20% పెరుగుతుందని అంచనా వేసింది.

ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్ గత త్రైమాసికంలో ఇన్నర్ వేర్ వ్యాపారం వృద్ధిని నమోదు చేసిందని, అయితే కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో అత్యధిక మంది ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అయితే ఇప్పుడు ఇన్నర్స్ కు ఆకస్మికంగా డిమాండ్ పెరగడం వల్ల అనేక కొత్త బ్రాండ్‌లు మార్కట్ లోకి వచ్చాయి. ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి.

శుభవార్త చెప్పిన ఆర్బీఐ

అంతేకాదు జూలైలో ద్రవ్యోల్బణం రేటు 3.54%కి తగ్గింది. రుతుపవనాల ప్రభావం కూడా బాగానే ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.2%గా ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..