ఐటీ(IT) ఉద్యోగాల్లో పురుషులకు ధీటుగా మహిళలు(Womens) రాణిస్తున్నారు. మాన్‌స్టర్ డేటా ప్రకారం ఐటీ/బీపీఓ ఉద్యోగాల్లో మహిళలు 30 శాతంగా ఉన్నారు. ఇక IT/సాఫ్ట్‌వేర్‌లో 24 శాతం, బ్యాంకింగ్(Banking)/అకౌంటింగ్/ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో13 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం 85 లక్షల మంది క్రియాశీల మహిళా ఉద్యోగులు, దాదాపు 7,800 మంది మహిళలు నిర్దిష్ట ఉద్యోగాలుగా ఉన్నారు. ఐటి/సాఫ్ట్‌వేర్ పరిశ్రమ సమానమైన సంఖ్యలో స్త్రీ, పుషులను తీసుకుంటుంది. మాన్‌స్టార్.కామ్ ప్రకారం, కార్యాలయంలో నూతనత్వం, సామర్థ్యం, సమానత్వాన్ని తీసుకురావడానికి సంస్థలు ఎక్కువగా మహిళలను నియమించుకోవాలని చూస్తున్నాయి. మొత్తం మహిళా ఉద్యోగార్ధులలో అత్యధిక వాటా IT/సాఫ్ట్‌వేర్ పరిశ్రమలో ఉంది. బ్యాంకింగ్/అకౌంటింగ్/ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమ 16 శాతం మహిళ ఉద్యోగులతో రెండో స్థానంలో ఉన్నాయి.
విద్య (9%), ITలు/BPO (5%), హాస్పిటల్స్/హెల్త్‌కేర్/డయాగ్నోస్టిక్స్ (4%) వంటి పరిశ్రమలు కూడా మహిళా ఉద్యోగులను తీసుకోవాలని చూస్తున్నాయి. ” దేశంలో వేగంగా మారుతున్న ఉపాధి మార్కెట్‌లో మరింత సమానమైన ఉత్పాదక శ్రామికశక్తికి మార్గం సుగమం చేస్తున్నందున మహిళా ప్రాతినిధ్యం, ప్రత్యేకించి అగ్రశ్రేణి నిర్వహణ పాత్రలలో కీలకమైనది. ITeS, BPO, బ్యాంకింగ్ వంటి టెక్-ఎనేబుల్డ్ పరిశ్రమలు మహిళలను నియమించుకోవడంలో ముందు వరుసలో ఉన్నాయి. అంతేకాకుండా, చిన్న వయస్సులోనే నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం, అందరికీ సమానమైన అవకాశాలను కల్పించడంతో స్త్రీ, పురుషులు సమానంగా ఉంటారని Monster.com CEO శేఖర్ గారిసా అన్నారు.
Read Also.. UPI123Pay: ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేని ఫీచర్ ఫోన్‌ల నుంచి యూపీఐ సేవలు