Reliance Share: షేర్ హోల్డర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్.. 100 షేర్లకు మరో 100 ఫ్రీ

జియో యూజర్లకు అంబానీ అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఈ దీపావళీ నుంచి జియో యూజర్లకు 100జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నట్టు ముకేష్ అంబానీ 47వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో(Relaince AGM)లో ప్రకటించారు.

Reliance Share: షేర్ హోల్డర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్.. 100 షేర్లకు మరో 100 ఫ్రీ
Mukesh Ambani

Updated on: Aug 29, 2024 | 4:15 PM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను భారతదేశంలో ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి తెస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను తాము అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్నామని తెలిపారు. ముంబయిలో జరిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 47వ AGMలో ఆయన మాట్లాడారు. జియో యూజర్లకు అంబానీ అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఈ దీపావళీ నుంచి జియో యూజర్లకు 100జీబీ వరకు ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు.

మరోవైపు ఈ ఏజీఎం సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రకటించారు రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ. జియో యూజర్లకు 100జీబీ ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజీని ఉచితంగా ఇవ్వడంతో పాటు.. ‘హలో జియో’ పేరుతో సెటప్ బాక్స్ కోసం టీవీ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇకపై జియో ఫైబర్ రిమోట్‌లో AI బటన్‌తో కొత్త ఫీచర్ ఉంటుందన్నారు. రిలయన్స్‌ షేర్స్ ఉన్నవాళ్లకు 1:1 పద్ధతిలో బోనస్‌ షేర్లు ఇస్తామని అంబానీ ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

ఈ సమావేశంలోనే వారసులకు కంపెనీల బాధ్యతలు అప్పగించారు ముకేష్ అంబానీ. ఇషాకు రిటైల్‌, ఆకాశ్‌కి జియో, అనంత్‌కి న్యూ ఎనర్జీ బిజినెస్‌లు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేశారు. అటు రిలయన్స్‌ గ్రూప్‌నకు చైర్మన్‌గా మరో ఐదేళ్ల పాటు ముకేష్‌ అంబానీ కొనసాగనున్నారు. అంతేకాకుండా డిస్నీ హాట్‌స్టార్ ఇండియా, జియో విలీనం పూర్తయింది. ఇవన్నింటితో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గురవారం ఏకంగా 2 శాతం పెరిగింది. షేర్ మార్కెట్ మొదలైన సమయంలో రూ. 3,007 దగ్గర ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర.. మార్కెట్ ముగిసే సమయానికి రూ. 3,038.90 దగ్గర స్థిరపడింది.

ఇది చదవండి: రూ. 10 లక్షలు పెట్టినోళ్లకు రూ. 4.5 కోట్లు.. ఈ బాహుబలి ఫండ్‌తో డబ్బులు డబుల్.!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి