Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!

Jeep India: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక మల్టీ నేషనల్‌ కార్పొరేషన్‌ స్టేల్లంటిస్‌..

Jeep India: జీప్‌ ఇండియా నుంచి సరికొత్త కారు.. 7 సీట్ల ఎస్‌యూవీ మెరిడియన్‌..!

Updated on: Feb 14, 2022 | 4:00 PM

Jeep India: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల కార్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి కంపెనీలు. ఇక మల్టీ నేషనల్‌ కార్పొరేషన్‌ స్టేల్లంటిస్‌ జీప్‌ ఇండియా. సోమవారం కంపెనీ 7-సీటర్ ఎస్‌యూ‌వీ పేరును ప్రకటించింది. జీప్ ఈ కొత్త ఎస్‌యూ‌వి (SUV) పేరుని జీప్ మెరిడియన్ (Jeep Meridian) అని వెల్లడించింది. ఇండియా మార్కెట్‌కు ఈ మోడల్ పేరును కస్టమర్ల కోసం కనెక్టికిటి, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ పేరును ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. జీప్ మెరిడియన్ జీప్ బ్రాండ్ ప్రధాన డి‌ఎన్‌ఏను కలిగి ఉంటుంది.

అయితే జీప్‌ మెరిడియన్‌ పూర్తిగా మేడ్‌ ఇన్‌ ఇండియా ఎస్‌యూవీగా వస్తుంది. దీంతో పాటు గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని, ఫీచర్-రిచ్ క్యాబిన్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. మేడ్‌- ఇన్‌-ఇండియా అండ్‌ మేడ్‌ -ఫర్‌- ఇండియా జీప్‌ మెరిడియన్‌ భారతదేశంలో జీప్ మొట్టమొదటి 7-సీటర్ ఎస్‌యూ‌వి అవుతుంది. జీప్ ఉత్పత్తి లైన్‌ని బలోపేతం చేసే ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా జీప్‌ ఇండియా హెడ్‌ నిపున్‌ జె మహాజన్‌ మాట్లాడుతూ.. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల వరకు మేము ఎస్‌యూవీని పరీక్షించాము. జీప్‌ మెరిడియన్‌ ఎటువంటి లోపాలు లేకుండా పని చేస్తుందని చెప్పేందుకు సంతోషిస్తున్నామని అన్నారు. అయితే జీప్‌ ఇండియా మెరిడియన్‌ ఎస్‌యూవీని ఈ ఏడాది ఇండియాలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది.

ఇవి కూడా చదవండి:

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో వారికి నైట్‌ డ్యూటీ అలవెన్స్‌..!

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. సుంకంలో కోత.. మరింత దిగిరానున్న వంట నూనె ధరలు..!