
మీ ఆలోచనలు నేరుగా కళగా మారుతాయంటే ఎలా ఉంటుంది? జపాన్‌లో ఉన్న ఒక కంపెనీ మన మెదడు నుండి వచ్చే అలర్ట్ (brainwave) సిగ్నల్స్‌ని పంచుకుంటే, వాటిని కళగా మార్చడానికి ప్రతి వ్యక్తికి రూ. 600 చెల్లిస్తోంది. ఆ కళను ఎవరూ సృష్టించలేని ఓ ప్రత్యేకమైన రూపంలో ఇస్తున్నారు. అయితే ఈ జపనీస్ కంపెనీ తమ బ్రెయిన్ వేవ్ డేటాను కొనుగోలు చేసి, దానిని వివిధ ఫార్మాట్లలోకి మార్చి, తరువాత దానిని కళగా విక్రయించమని కస్టమర్లను ఆహ్వానిస్తోంది
టోక్యోకు చెందిన BWTC అనే సంస్థ ప్రజల అంతర్గత ఆలోచనలు, భావోద్వేగాలను ఆధునిక కళాకృతులుగా మార్చే ఆఫర్‌ను అందిస్తోంది. రాజధాని చియోడా జిల్లాలోని BWTC మెటావర్స్ స్టోర్‌కు పాల్గొనేవారిని ఆహ్వానిస్తోంది. అక్కడ వారికి 100 సెకన్ల బ్రెయిన్‌వేవ్ స్కానింగ్ కోసం రూ. 590 (1,000 జపనీస్ యెన్) చెల్లిస్తారు.
ఈ కంపెనీ, “Neuro Art” అనే పేరుతో ఈ కొత్త విధానాన్ని ప్రాథమికంగా ప్రారంభించింది. వారు BCI (Brain-Computer Interface) అనే టెక్నాలజీని ఉపయోగించి, మన బ్రెయిన్‌కు సిగ్నల్స్‌ని పరికరాల ద్వారా ట్రాక్ చేసి, వాటిని ప్రత్యేకమైన కళలుగా మార్చేస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా మానవ బ్రెయిన్ నుండి వచ్చే అలర్ట్ సిగ్నల్స్‌ను కంప్యూటర్ పరికరాలు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆ సిగ్నల్స్‌ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా అన్వయించి, అవి కళ రూపంలో మారిపోతాయి.
వ్యక్తిగత ఆర్ట్:
ఈ ప్రత్యేక కళలు పూర్తిగా వ్యక్తిగతమైనవి. అంటే, మీరు ఒకే చోట కూడా కూర్చొని ఉంటే, మీ బ్రెయిన్ సిగ్నల్స్ ఆధారంగా రూపొందించిన ఆర్ట్ ఇతరులకంటే భిన్నంగా ఉంటుంది. కేవలం ఆలోచనలు మాత్రమే కాకుండా, మీరు అనుభూతి చెందుతున్న భావనలు, మూడ్ వంటివి కూడా ఆ ఆర్ట్‌లో ప్రతిబింబిస్తాయి. ఈ కంపెనీ ఒకరికి 600 రూపాయలు చెల్లిస్తూ, వారి బ్రెయిన్‌వేవ్ డేటాను సేకరిస్తుంది. ఆ తర్వాత వాటిని ఒక సృజనాత్మక కళా రూపంలో మార్చి, వారికి అందిస్తుంది. ఈ ప్రత్యేకమైన కళను ఒక డిజిటల్ ఫైల్ రూపంలో ఇస్తారు. లేదా కొంత మంది వినియోగదారులు ఆర్ట్ ప్రింట్ కూడా ఆర్డర్ చేస్తారు.
ఇది కూడా చదవండి: Smartphones: కస్టమర్లకు ఇది కదా కావాల్సింది.. కేవలం రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. పవర్‌ఫుల్ బ్యాటరీ, కెమెరా!
భవిష్యత్తులో ఆర్ట్, టెక్నాలజీ
ఈ విధానం ఆర్ట్, టెక్నాలజీ మధ్య ఉన్న కొత్త సంబంధాలను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఈ రకమైన బ్రెయిన్-ఆర్ట్ సృష్టించేందుకు మార్గాలు తెరవవచ్చు. అలాగే ఇది మన ఆలోచనలు, భావాలను ఆర్ట్ ద్వారా వ్యక్తీకరించే కొత్త సాధనంగా మారవచ్చు. తాము 1,853 మంది నుండి 185,300 సెకన్ల బ్రెయిన్ వేవ్‌లను కొనుగోలు చేశామని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ కంపెనీ “Neuro Art” అనే ప్రాజెక్ట్ ద్వారా మనం ఆలోచించే విధానాన్ని కళగా మార్చుతున్నది. ఇది ఒక ఆధునిక బిసినెస్ మోడల్‌గా మారింది. ఫ్యూచర్‌లో ఇంకొన్ని రంగాలు కూడా ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించవచ్చు.
ఇది కూడా చదవండి: Viral Video: ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను నిమిషాల్లోనే పట్టేసిన మహిళా ఆఫీసర్.. చూస్తేనే జడుసుకుంటారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి