Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సమయ వేళల్లో మార్పు!

Janmabhoomi Express: రైల్వే శాఖ అప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ల ప్రయాణ సమయ వేళలను మార్చింది. కొత్తగా మార్చిన సమయ వేళలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి..

Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ సమయ వేళల్లో మార్పు!

Updated on: Dec 13, 2025 | 7:58 AM

Janmabhoomi Express: సాధారణంగా సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఆశ్రయిస్తుంటారు. అయితే రైల్వే శాఖ అప్పుడప్పుడు రైళ్ల సమయ వేళలను మారుస్తుంటుంది. అలాగే విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ల ప్రయాణ సమయ వేళలను మార్చింది. కొత్తగా మార్చిన సమయ వేళలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జోన్‌ సీపీఆర్వో శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: LPG Gas: గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.300లకే గ్యాస్‌ సిలిండర్‌.. ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఏయే సమయానికి బయలుదేరుతుంది?

విశాఖపట్నం-లింగంపల్లి (12806) ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖలో ఉదయం 6.20 గంటలకు బయలుదేరి, లింగంపల్లికి రాత్రి 7.15 గటలకు చేరుకుంటుంది. ఇక లింగంపల్లి-విశాఖ(12805) రైలు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి విశాఖకు రాత్రి 7.50 గంటలకు చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: ఇంకా ఎంత పెరుగుతుందో..? తులంపై రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర

అలాగే సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్‌ నుంచి అనకాపల్లికి జనవరి నెలలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే హైదరాబాద్‌ – గోరక్‌పూర్‌కు కూడా పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అలాగే మచిలిపట్నం-అజ్మీర్‌కు కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని వారపు రైళ్లను పొడిగించారు. సికింద్రాబాద్‌-అనకాపల్లి (నం.07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అలాగే అనకాపల్లి-సికింద్రాబాద్‌(నం.07042) రైలు జనవరి 5, 12, 19న తేదీల్లో, అలాగే హైదరాబాద్‌-గోరఖ్‌పుర్‌(నం.07075) ట్రైన్‌ జనవరి 9, 16, 23 తేదీల్లో ఉందుబాటులో ఉంటాయి. అలాగే గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌(07076) రైలు జనవరి 11 18, 25 తేదీల్లో బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ఇది కూడా చదవండి: Ozempic: డయాబెటిస్‌ వారికి శుభవార్త.. నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది.. ఉపయోగమేంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి