అపర కుబేరులు అంబానీ (Ambani)ల ఇంట పెళ్లంటే మాములుగా ఉండదు. దేశ, విదేశాల నుంచి అతిథులు వస్తారు. రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు. 2018లో ముఖేష్ అంబానీ (Mukesh Ambani) కూతురు ఇషా అంబానీ (Isha Ambani)- ఆనంద్ పిరమల్ , ఆ మరుసటి ఏడాదే కుమారుడు ఆకాశ్ అంబానీ (Akash Ambani)- శ్లోకా మెహతాల వివాహ వేడుకలే ఇందుకు ప్రతక్ష నిదర్శనం. తాజాగా ఆ ఫ్యామిలీ మరో రాయల్ అండ్ గ్రాండ్ వెడ్డింగ్ కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అదే అనిల్ అంబానీ- టీనా అంబానీల కుమారుడు జై అన్మోల్ ది. గతేడాది డిసెంబర్ లో తన ప్రియురాలు క్రిషా షాతో అతను నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
హాజరు కానున్న బాలీవుడ్ సెలబ్రిటీలు..
మొదట ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే అన్మోల్- క్రిషా షాల ప్రి వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ వెంటనే అంబానీ కుటుంబ సభ్యులు వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. కాగా వీరి పెళ్లి ముహూర్తంపై అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. అయితే వీరి పెళ్లికి ముఖేష్ అంబానీ- నీతాతో పాటు వారి పిల్లలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గతంలో లాగే పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ రాయల్ వెడ్డింగ్ కు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతిథుల జాబితాను ఫైనలైజ్ చేసే పనిలో అంబానీ కుటుంబ సభ్యులు ఉన్నారట.
Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..
Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..